Vakati Narayana Reddy
Vakati Narayana Reddy : మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత, వాకాటి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కూడా ఈయన టీడీపీలోనే పనిచేశారు. 2019లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతోపాటు జమ్మలమడుగుకు చెందిన కొందరు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
చదవండి : Chandrababu : భయపెట్టాలని చూస్తారా ? అస్సలు భయపడను – చంద్రబాబు
కాగా నారాయణరెడ్డి.. మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి స్వయానా తమ్ముడు. నారాయణరెడ్డి కుటుంబం టీడీపీలో చేరడంతో ఆయన కుమారుడు భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి జమ్మలమడుగు కంచుకోటని అన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో కొందరు టీడీపీని వీడారని, అయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదని అన్నారాయన.
చదవండి : Chandrababu Naidu Issue : వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత పెంపు