Kesineni Nani: రాజకీయాల్లోకి రీఎంట్రీ వార్తలపై స్పందించిన కేశినేని నాని.. కీలక ప్రకటన

మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని, జాతీయ పార్టీలో ఆయన చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది.. ఆ ప్రచారంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Kesineni Nani

Kesineni Nani: ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ కేశినేని నానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన టీడీపీ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కేశినేని నాని.. ఈ ఏడాది ప్రారంభంలో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, కొద్దిరోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని, భారతీయ జనతా పార్టీలో ఆయన చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజా ప్రచారంపై కేశినేని నాని స్పందించారు.

Also Read: Talliki Vandanam : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.15వేలు ఇచ్చేది ఎప్పుడో చెప్పేశారు..

కేశినేని నాని మాట్లాడుతూ.. ఇటీవల మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది జనవరి 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్దత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని నాని తెలిపారు.

Also Read: Annadata Sukhibhava: గుడ్ న్యూస్.. ఏపీలో రైతులకు రూ.20వేలు ఇచ్చేది ఎప్పుడో చెప్పేశారు..

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేస్తాను. సమాజానికి నా సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదు. కానీ, విజయవాడలోని నా తోటి పౌరుల శ్రేయస్సు కోసం నా లోతైన అంకితభావంతో ముడిపడి ఉందని కేశినేని నాని పేర్కొన్నారు. నా రాజకీయ పునరాగమనానికి సంబంధించి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని నేను అందరినీ కోరుతున్నాను. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి వారి శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే నా దృష్టి ఉంది. నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతాను. అదే అభిరుచి, నిబద్ధతతో నా సేవను కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను అని కేశినేని నాని అన్నారు.