Nellore City Ex MLA: నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూత
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు.

Nellore Ex Mla
Nellore City Ex MLA: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. ఏడాది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన.. ఈరోజు(31 జనవరి 2022) ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీల నేతగా ఉన్న శ్రీధర్ కృష్ణారెడ్డి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
నెల్లూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడిగా, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా నెల్లూరు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున అనీల్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి అయ్యారు. 2009లో అనీల్ యాదవ్‌పై 90ఓట్ల మెజారిటీతో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గెలిచారు.
తర్వాతికాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు శ్రీధర్ కృష్ణారెడ్డి. ఆ ఎన్నిల్లో అనీల్‌పై 19వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో ఆ స్థానం నుంచి పొంగూరు నారాయణ తెలుగుదేశం తరపున పోటీ చేశారు.