Bhumana Karunakar Reddy
Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
“మంచి చేబితే వినే పరిస్థితిలో బీఆర్ నాయుడు లేరు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి కర్మ క్రియలకు వెళ్లి, ఆయనకు శ్రీవారి పట్టు వస్త్రాన్ని కప్పి బీఆర్ నాయుడు ఘోర అపచారం చేశారు.
అంతేకాకుండా అదేరోజు వెంకయ్య చౌదరికి పరివట్టం కట్టి, వేద పండితులతో వేద ఆశీర్వాదం ఇప్పించి పెద్ద అపచారం చేశారు. పరివట్టం అనేది తిరుమలలో స్వాములకు మాత్రమే కడుతారు.
Also Read: కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వ రేసులో ఆ నలుగురు నేతలు.. వీరే..
కర్మ క్రియలకు వెళ్లి స్వామి వారి లడ్డూ, ప్రసాదాలను ఇచ్చిన ఘనత బీఆర్ నాయుడుకే చెందుతుంది. పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు.
రేపు ఎవరో ఒక వీఐపీ చనిపొతే బీఆర్ నాయుడు వెళ్లి అక్కడ కూడా ఇలాంటి పనులు చేస్తారేమో. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరించారు. కోయంబత్తూరుకు చెందిన జీ స్క్వేర్ అనే సంస్థ కార్యాలయంలో స్వామి వారి దేవాలయం కట్టుకోవాలని సీఎం లేఖ రాశారు.
ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి ఇవ్వడం ఎంటి? బీజేపీ నేత అన్నామలై ఈ కంపెనీపై చాలా రకాల అవినీతి ఆరోపణలు చేశారు. ఈడీ దర్యాప్తు కూడా కోరారు. అలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో టీటీడీ ఆలయం ఎలా కడుతారు? ఇలా అయితే రోజుకొక రియల్ ఎస్టేట్ కంపెనీ టీటీడీ ఆలయం కట్టాలని అడుగుతుంది” అని అన్నారు.