Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
Crime news: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని పోయారు..
- Harishth Thanniru
- Published On : May 28, 2022 / 07:28 AM IST
Cylinder Blast
Crime news: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని పోయారు. వీరిలో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు మృతి, మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Nandyala Crime News: ఎలుకల మందు పెట్టి చెల్లెలిని చంపిన అక్క: అసలు విషయం తెలిస్తే షాక్
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా సిలీండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇంటి పైకప్పు కూడా కూలడంతో కుటుంబ సభ్యులంతా శిథిలాల కింద చిక్కుకు పోయారు. సిలీండర్ పేలుడుతో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఘటన స్థలికి చేరుకొని చూడగా.. ఇంటిపైకప్పు కూలి ఉండటంతో పాటు దట్టమైన పొగ కమ్ముకొని ఉంది. వెంటనే గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులకు సమాచారం అందించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన జైనుబి(60), దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6) మృతిచెందారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రగా గాయపడ్డారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున సమయంలో విషాద ఘటన చోటు చేసుకోవటంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
