Family Suicide
Four members of the same family suicide : ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అప్పుల బాధ తాళలేక ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
నంద్యాల పట్టణంలో మాల్దార్‌పేటకు చెందిన మంచా శేఖర్ ఆయన భార్య కళావతి, ఇద్దరు పిల్లలు అంజని, అఖిలలు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి పడుకున్నవారు తెల్లావారే సరికి శవాలుగా మారడంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
భార్యభర్తల వయస్సు 35 లోపు ఉండటం. పిల్లలిద్దరి వయస్సు 15 ఏళ్ల లోపు ఉండటంతో ఈ మరణాలు చూసిన వారు చలించిపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.