శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొందరు వైసీపీ వైపు చూస్తున్నారా..? అనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా..వ్యూహలు రచిస్తోంది. అందులో భాగంగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం టీడీపీ ఎల్పీ మీటింగ్ జరుగుతోంది. కానీ ఈ సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. తాము మీటింగ్‌కు హాజరు కాలేమంటూ..ముందుగానే వీరు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల దూరంగా ఉన్నారు.
తన సోదరికి సంబంధించి కుటుంబ కార్యక్రమాలు ఉన్నందువల్ల రావడం లేదని కేఈ, బంధువుల వివాహ ఉందని తిప్పేస్వామి, అనారోగ్యం ఉందని శత్రుచర్ల సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొందని టాక్. ఎందుకంటే..ఇప్పటికే పార్టీకి పోతుల సునీత, శివనాథ్ రెడ్ది, డొక్కా మాణిక్య వరప్రసాద్ దూరమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలు చేజారిపోకుండా..టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
మండలి రద్దు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వారి మనస్సు మారకుండా బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ నుంచి ఎవరూ జారిపోరని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీల్లో వేరే ఆలోచన లేదని, అందరూ టీడీపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని వెల్లడిస్తున్నారు.
* 2020, జనవరి 27వ తేదీ సోమవారం శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి.
* మండలి రద్దు చేయాలా ? ఉంచాలా ? అనే దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
* సమావేశానికి హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై టీడీపీ ఓ నిర్ణయం తీసుకోనుంది.
* రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు శాసనమండలిలో పాస్ కాలేదు.
* ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు.
* ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
* మండలి అవసరం ఏంటీ అనే ప్రశ్నను శాసనసభలో లేవనెత్తారు సీఎం జగన్.
* మండలి సభను నిర్వహించడం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు.
* అంతకంటే ముందు..సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీతో సీఎం జగన్ చర్చలు జరిపారు.
* మరి టీడీపీ ఎమ్మెల్సీలు శాసనసభకు హాజరవుతారా ? మండలి రద్దు అవుతుందా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది.
Read More : కోసినా.. నా రక్తం పచ్చగానే ఉంటుంది – టీడీపీ డిప్యూటీ లీడర్ శ్రీనివాస్