విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సెయింట్ ఆంటోనీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ చూసి.. తాము కూడా అలానే సంపాదించి కార్లు, ఇళ్లు కొనుక్కోవాలని అనుకున్నారు. ఆ హీరోలాగే తాము జీవితంలో బాగా ఎదుగుతామని భావించారు.
విద్యార్థులు నలుగురూ ప్లాన్ వేసుకుని గేటు దూకి వెళ్లిన దృశ్యాలు హాస్టల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో కనపడ్డాయి. ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్లలోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో పేదరికంతో బాధపడుతూ తప్పుడు మార్గంలో బాగా డబ్బు సంపాదిస్తాడు. అదే విధంగా తాము కూడా సంపాదించి కోటీశ్వరులు అయిపోవచ్చని ఈ నలుగురు విద్యార్థులు భావించడం గమనార్హం.
కాంగ్రెస్ కూడా కేసీఆర్ బాటలోనే సాగుతోంది: ఎంపీ ధర్మపురి అరవింద్