AP Assembly Sessions
AP Assembly Sessions 2023 : ఏపీ అసెంబ్లీ నుంచి ఒకేరోజు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.టీడీపీ సభ్యులు సభను అగౌరపరిచేలా ప్రవర్తించారని..సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, అనగాని సత్యప్రసాద్ సహా 15 మంది టీడీపీ సభ్యులను అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా సస్పెండ్ చేశారు.
సభలో మీసాలు తిప్పటం సరికాదు అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణను హెచ్చరించారు. సమావేశాలు ముగిసే వరకు సయ్యావుల కేశవ్,సత్యప్రసాద్, కోటంరెడ్డిలను సస్పెండ్ చేశారు. సభా సంప్రదాయాలు ఉల్లంఘించారంటూ మండిపడ్డారు. సభా హక్కుల ఉల్లంఘన చేసినా..ఆస్తులకు నష్టం చేసేలా వ్యవహరించినా ఆ నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం అంటూ హెచ్చరించారు.చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దీనిపై చర్చ జరపాలని పట్టుపట్టారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ఈ క్రమంలో వైసీపీ సభ్యులు, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాదనలు ప్రతీవాదనలు. సవాళ్లు ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. బాలకృష్ణ మీసం తిప్పితే వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడకొట్టారు. మంత్రి అంబటి బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ సభను వాయిదా వేశారు. 10నిమిషాల అనంతం తిరిగి సభ ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితి నెలకొనటంతో స్పీకర్ తమ్మినేని 15మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.