Janasena Pawan Kalyan
Janasena Pawan Kalyan : తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే తప్ప బెదిరింపులకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. దీక్షను విరమించాక మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థికమూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. వాళ్లు అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తా. సినిమా టికెట్ ధరల అంశంలో పారదర్శకత లేదని చెబుతున్నారు. మీకుందా పారదర్శకత? మీకంత పారదర్శకత ఉంటే ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? అని ప్రశ్నిస్తే చాలు… బూతులు తిట్టేస్తారు.
WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్
సినిమా థియేటర్ల నుంచి పన్నులు రావడం లేదు, టికెట్ల వ్యవహారంలో పారదర్శకత లేదు… అంతవరకు ఓకే… కానీ మీరు అమ్మే మందుకు పారదర్శకత ఉందా? మద్యం మీద ఏడాదికి రూ.40 వేల కోట్లు వస్తోందట… మద్యం వ్యాపారంలో వచ్చిన డబ్బును లారీల్లో గట్టి బందోబస్తు మధ్య తీసుకెళుతున్నారంట… నిజమేనా?” అని పవన్ ప్రశ్నించారు.
Elderly Couple Sells Poha : హ్యాట్సాఫ్.. 70ఏళ్ల వయసులోనూ ఎవరి మీద ఆధారపడకుండా పోహా అమ్మి జీవనం
ఏపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్యానికి వైసీపీ హానికరం అని అన్నారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న పవన్, అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు. మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే, వాళ్ల తరఫున నిలబడతాం అన్నారు పవన్. లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి నేను ఏమీ చేయలేను అన్నారు.