Gadde Ramamohan: పార్టీ మారిన తర్వాత ఇలా మాట్లాడడం సరైందేనా కేశినేని నాని?: గద్దె రామ్మోహన్ రావు

సమర్థవంతుడు అంటే పార్టీలు‌ మారేవ్యక్తా? అని గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.

Gadde Ramamohan Rao

టీడీపీని వీడిన తర్వాత విజయవాడ నేత కేశినేని‌ నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మండిపడ్డారు. విజయవాడలో గద్దె రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు ప్రాంతాల్లో తన గురించి కేశినేని నాని మాట్లాడారని చెప్పారు. ‘నేను సమర్థవంతుడిని కాదని కేశినేని నాని అంటున్నారు.

సమర్థవంతుడు అంటే పార్టీలు‌ మారేవ్యక్తా? నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా భారీ మెజారిటీతో గెలిశాను. గత ఎన్నికల్లో నాకు  మెజారిటీ పెరిగితే.. కేశినేని నానికి మెజారిటీ తగ్గింది. నేను సమర్థవంతుడినా? కేశినేని నానా? నేను అప్పట్లో ఎన్టీఆర్ ప్రభంజనం ఉన్న సమయంలో కూడా ఇండిపెండెంట్‌గా గెలిచాను.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో విజయవాడ కోసం ఎంతో చేశారు. కేశినేని నాని గుర్తుపెట్టుకోవాలి. సీఎం జగన్ విజయవాడకు ఎంత బడ్జెట్ కెటాయించారో చెప్పాలి. కాంట్రాక్టులకు కనీసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానిది. చంద్రబాబు ఏదైనా కార్యక్రమం చేయాలంటే దానిపై పూర్తిగా దృష్టి పెట్టి చేస్తారు.

కేశినేని నానికి అన్ని తెలిసి కూడా ఇప్పుడు పార్టీ మారిన తర్వాత టీడీపీపై అసత్యాలు ప్రచారం చేస్తుండడం సరైందేనా? వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు అనేక సార్లు వచ్చారు. వరదలు వచ్చినప్పుడు జగన్ ఎప్పుడైనా వచ్చారా?’’ అని ప్రశ్నించారు.

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా