చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ కేసులో చంద్రబాబుకు గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.

Chandrababu Bail Petition
Chandrababu Case : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దాంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. స్కిల్ కేసులో 17ఏ పైన ఇటీవలే తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్ కు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుంటూరు ప్రేరణ, గుంటూరు ప్రమోద్ కుమార్ లు కోరారు.
Also Read : జగన్ ఆస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించింది సుప్రీం ధర్మాసనం. స్కిల్ కేసులో చంద్రబాబుకు గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సీఐడీ. ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
గతంలోనే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అయితే, సెక్షన్ 17ఏకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఆ కేసు తేలేంత వరకు ఈ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే గతంలో చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు ప్రకారం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో, అందుకు సమయం కోరడంతో ఈ కేసు విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆలోపు ఇరుపక్షాల వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నవంబర్ నెలలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే ఏపీ సీఐడీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తమ వాదన పరిగణలోకి తీసుకోకుండా ఏపీ హైకోర్టు చంద్రబాబుకి స్కిల్ కేసులో బెయిల్ మంజూరు చేసిందని, చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు, ఇన్ ఫ్లుయన్స్ చేయగల వ్యక్తి.. కచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కనుక బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును కోరింది.
Also Read : జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?