ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడి గ్యాంగ్ ర్యాష్‌ డ్రైవింగ్‌..కానిస్టేబుల్‌పై దౌర్జన్యం

Deputy CM Dharmana’s son Gang rash driving : విశాఖ బీచ్‌ రోడ్‌లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు రామ్‌ భరత్‌ ఫ్రెండ్స్‌ హల్‌చల్‌ చేశారు. బీచ్‌రోడ్డులో కారును అతివేగంగా నడిపారు. వేగంగా వెళుతున్న కారును కానిస్టేబుల్‌ ఆపడంతో రామ్‌ ఫ్రెండ్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం కొడుకు కారును ఆపుతావా? అంటూ బెదిరింపులకు దిగారు. కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ధర్మాన కుమారుడు కారులోనే ఉన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటనపై కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఇక సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న రామ్‌ స్నేహితుల హల్‌చల్‌ దృశ్యాలు.. ధర్మాన కృష్ణదాసు దృష్టికి కూడా వెళ్లాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి కేసులు లేకుండా పోలీసులు రాజీ చేశారు.