Ganta Srinivasa Rao (2)
Ganta Srinivasa Rao – CM Jagan : సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎన్నికల ముందు అమరావతి అన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారని పేర్కొన్నారు. నిజంగా జగన్ కు దమ్ముంటే వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టి ఎన్నికలకు వెళ్ళాలని ఛాలెంజ్ చేశారు. విశాఖకు సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ దొంగ జీవో విడుదల చేసిందని అన్నారు. జీవో ఇచ్చిన అధికారులు సిగ్గు పడాలి అని అన్నారు.
ఈ మేరకు గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. వంద రోజుల్లో జగన్ పదవి కాలం ముగియనుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తురావడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం కార్యాలయం ఏర్పాటు చేసేందుకు డొంక తిరుగుడు పని అని విమర్శించారు. సీఎం కార్యాలయం గురించి మంత్రులు అనేక విధాలుగా చెప్పారని తెలిపారు. ఋషికొండ నిర్మాణం కోసం రూ.288 కోట్ల నిధులు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
Lokesh : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం
ఋషికొండలో సచివాలయం అని ఆగస్టు 12న వైసీపీ పార్టీ అధికారికంగా ఓ ట్వీట్ చేసిందని, ఈ ట్వీట్ తప్పని ఆ తర్వాతి రోజు మళ్ళీ మరో ట్వీట్ వచ్చిందని గుర్తు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి, సద్దాం హుస్సేన్ ఇళ్ల మాదిరిగా జగన్ ఇంటికి మెటీరియల్ వాడారని తెలిసిందన్నారు. స్క్వేర్ ఫీట్ కు రూ.25వేలు ఖర్చు చేసినట్లు తెలుస్తుందని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు జగన్ అసెంబ్లీలో చెప్పారని, పైగా 30 వేల ఎకరాల్లో కేపిటల్ ఉండాలని అన్నారని గుర్తు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క ఇటుక పెడ్డ గానీ, తట్ట మట్టి వేయలేదని విమర్శించారు. రాజధాని అంశంపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. దానిపై జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు, కోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదన్నారు. దమ్ము ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సవాల్ చేశారు. ఆఖరి దశలో దసరాకి వస్తే అదే మీకు అంతిమ యాత్ర అవుతుందన్నారు.
CM Jagan : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్
నవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు.
రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2018, 2019లో వైసీపీకి 80 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినట్లు ఈసీకి విజయసాయిరెడ్డి లెటర్ ఇచ్చారని, అందులో ఒక్క విశాఖ ఎంపీ మేజర్ షేర్ రూ.11 కోట్లు ఉండడం విశేషం అన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని తెలిపారు.