CM Jagan : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్

చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ముఖం చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయన్నారు. చంద్ర బాబుముఖం చూస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు.

CM Jagan : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్

CM Jagan serious on Chandrababu

CM Jagan – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ఉండడానికి చంద్రబాబు కోర్టుకి వెళ్ళాడని పేర్కొన్నారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడు ఇళ్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ముఖం చూస్తే స్కామ్ లు జగన్ ముఖం చూస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయన్నారు. చంద్ర బాబుముఖం చూస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయని విమర్శించారు. గజ దొంగల ముఠా ఈ తేడా గుర్తించాలన్నారు. గురువారం కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం జగన్ మాట్లాడారు.

గత ప్రభుత్వాలు ఏనాడైనా పేద ప్రజల గురించి ఆలోచించాయా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలను ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయని, ఇళ్ళు కాదు ఊళ్ళు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పారు.

కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ సంక్షేమం ఆపలేదన్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలువ ఉంటుందని తెలిపారు. ఒక్కో ఇంటికి 2లక్షల 70 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక సెంట్ భూమి కూడా పేద ప్రజలకు ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా సెంట్ భూమి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కానీ, తమ ప్రభుత్వం కుప్పంలో కూడా 20 వేల ఇళ్లు ఇచ్చామని తెలిపారు.

Also Read : భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో వెలుగులోకి కీలక విషయాలు

చంద్రబాబు 30ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యే గా ఉన్నాడు, మూడు సార్లు సీఎంగా ఉన్నా కుప్పానికి మంచి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఒక్క ఇళ్లు కూడా నిర్మించకోలేదన్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్నాడని తెలిపారు. ఈ రాష్ట్రంతో చంద్రబాబుకి ఉన్న సంబంధం అది అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక నెల రోజులైనా రాష్ట్రంలో కనిపించాడా, కేవలం ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నాడని పేర్కొన్నారు.

Also Read: పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. వాళ్లు కలిసినప్పుడు.. వీళ్లు కలిస్తే తప్పేంటి?

చంద్రబాబుకు గానీ, చంద్రబాబు సమర్థించిన వాళ్ళు రాష్ట్రంలో ఉండరని విమర్శించారు. చంద్రబాబు గానీ, ఆయనను సమర్ధించిన దత్త పుత్రుడు, కొడుకు, బావమరిది ఎవ్వరూ రాష్ట్రంలో ఉండబోరని తెలిపారు. వీళ్ళు ఈ రాష్ట్రం దోచుకుని హైదరాబాద్ లో పంచుకుంటారని పేర్కొన్నారు. దత్త పుత్రుడు ఇల్లు హైదరాబాద్ లో ఉంటుంది కానీ, సతీమణులు మాత్రం మూడు సవంత్సరాలకు ఒక్క సారి మారిపోతూ ఉంటారని తెలిపారు. ఒక్కసారి లోకల్ , మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్ నేషనల్, మరి నాలుగో సరి ఎక్కడకి పోతాడో చూడాలన్నారు.

పాలకులే ఇల్లాలు విషయంలో ఇలా ఉంటే ఏమి ఆదర్శమని నిలదీశారు. ప్యాకేజ్ స్టార్ ఓడిపోయిన భీమవరం , గాజువాక తోనూ సంబంధం లేదన్నారు. తన అభిమానుల ఓట్లను అమ్ముకోవడానికి మాత్రమే వస్తారు.. సొంత పార్టీని, సొంత మనుషులను అమ్ముకుని వ్యాపారం చేస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు షూటింగుల మధ్య వచ్చి మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. వీరికి అధికారం కేవలం దోచుకోవడానికి కావాలన్నారు. దోచుకున్న దానిని హైదరాబాద్ లో పంచుకుంటారని ఆరోపించారు. మన రాష్ట్రంలో కనిపించని వారు మన రాష్ట్రం కోసం మాట్లాడతారని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం పని చేస్తారని ఎద్దేవా చేశారు.

Also Read : విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, మంత్రులు, అధికారులకు వసతి కల్పనకు కమిటీ

చంద్రబాబు అధికారం పోతే వీరికి ఫీజులు పోతాయన్నారు. చివరికి కాపులను కూడా తన కాపులు అని కూడా చెప్పుకోలేరన్నారు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అవహేళన చేస్తారు, బీసీల తోకలు కట్ చేస్తానని అంటారు అని పేర్కొన్నారు. వీళ్ళ మనిషి సీఎంగా లేకపోతే ప్రభుత్వం ఎంత మంచి చేసిన పట్టించుకోరన్నారు. మన రాష్ట్రంపై నమ్మకం లేని వీరికి ఎల్లో సోషల్ మీడియా, ఒక దత్త పుత్రుడు అండ ఉందన్నారు. రాజకీయాలు అంటే విలువలు ఉండాలని, రాజకీయమంటే విశ్వసనీయత ఉండాలన్నారు.