Ganta Srinivasa Rao
విజయమ్మ లేఖతో వైఎస్సార్‌సీపీ పూర్తిగా మునిగిపోయిందని భీమిలి ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజకీయ పార్టీని నడిపే నైతికత జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పారు. త్వరలోనే వైసీపీ నుంచి సీనియర్లు బయటకు రాబోతున్నారని, వైసీపీ మునిగిపోయిన పార్టీ అని చెప్పారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని అర్థం అయ్యిందని తెలిపారు.
ఇవాళ విశాఖలో గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దోచుకున్న ధనం సరిపోదని సోదరికి, తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి కోసం ఇబ్బందులు పెట్టడం ఆయన నైజానికి నిదర్శనమని చెప్పారు. 2004లో 92లక్షలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన జగన్ ఆస్తులు 2009 నాటికి 370 కోట్లకు చేరాయని అన్నారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం నైతికత ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఐటీ అభివృద్ధికి పాజిటివ్ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి కోడు గడ్డు అని కాలక్షేపం చేశారని అన్నారు. ఇప్పుడు ఐటీలో ప్రపంచ స్థాయి 10 కంపెనీల ద్వారా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి లోకేశ్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 100 రోజుల ప్రణాళిక, విశాఖ అభివృద్ధిపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేశ్