అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేశ్

ఈ వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు.

అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేశ్

Nara Lokesh

Updated On : November 1, 2024 / 9:15 AM IST

మంత్రి నారా లోకేశ్ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా లోకేశ్ అమెరికా పర్యటన జరిగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు.

అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాగా, కొన్ని గంటల ముందు అమెరికాలోని అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు నారా లోకేశ్.

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేశ్ ,గాలి భాను ప్రకాశ్, కోమటి జయరాం పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి అభిమానులు గులాబీ రేకులను వెదజల్లారు. అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఋ 14 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రవాస ఆంధ్రులు భారీగా హాజరయ్యారు.

Chandrababu-Pawan: శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు, ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన