Gautam Sawang : ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు : మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్

Gautam Sawang : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనపై వస్తున్న వార్తలపై రాష్ట్ర మాజీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అసలు వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్య

Gautam Sawang : ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనపై వస్తున్న వార్తలపై రాష్ట్ర మాజీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సీఎం జగన్‌పై వస్తున్న ఆరోపణలపై సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్న సమయంలో తాను సీఎంతో మాట్లాడానంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. అసలు వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందనే ఉద్దేశంతోనే స్పందిస్తున్నానని సవాంగ్ తెలిపారు. వివేకా కేసు విషయంలో సీఎం జగన్ ఎన్నడూ కూడా జోక్యం చేసుకోలేదని అన్నారు.

తాను డీజీపీగా ఉన్న సమయంలో అవినాశ్ రెడ్డి, ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదన్నారు. వివేకానందరెడ్డి, అవినాశ్ రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు లాంటివని సీఎం జగన్ తనతో చెప్పినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వివేక హత్య కేసులో చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాలని సీఎం జగన్ సూచించినట్టు మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు.

Gautam Sawang Ap Former Dgp Gautam Sawang Gives Clarity On Vivekananda Reddy Murder Case

వివేకా హత్యకేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని సీఎం చెప్పారని సవాంగ్ వెల్లడించారు. అంతేకాదు.. వివేకా హత్యకు సంబంధించి సీబీఐ విచారణకు అవసరమైన అన్ని వివరాలను అధికారులకు సమర్పించాలని సీఎం జగన్ చెప్పారని మాజీ డీజీపీ సవాంగ్ వెల్లడించారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై వస్తున్న ఆరోపణలపై మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వివేకా కేసు విషయంలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. డీజీపీగా ఉన్నప్పుడు తాను వ్యాఖ్యానించినట్టుగా పేర్కొంటూ వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలపై సవాంగ్ స్పందించారు. వివేకా హత్య కేసులో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, పైపెచ్చు కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని, దోషులకు శిక్ష పడేలా చూడాలనే తనతో చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

Read Also : Kadapa : వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ కంటిన్యూ 

ట్రెండింగ్ వార్తలు