GAD Key Orders : ఏపీలో సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని కూడా ప్రకటన జారీ చేసింది. జూన్ 3లోగా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అనుమతి లేకుండా సచివాలయంలో ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లకూడదని ఆదేశాలిచ్చింది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది.
ఏపీలో సాధారణ పరిపాలన శాఖ కీలక ఆదేశాలు..
* జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు
* సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆదేశాలు.
* ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం.
* వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ.
* జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలూ వేస్తామని.. ఆలోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించిన జీఏడీ.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ 3లోగా దీనికి సంబంధించిన వ్యవహారాలన్ని చక్కదిద్దాలని సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించింది. జూన్ 3న మంత్రుల పేషీలు, చాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా సచివాలయంలోని ఏ వస్తువును కానీ, ఎలాంటి పత్రాలను కానీ బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదంది.
ప్రత్యేకంగా మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలు తరలించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సెక్రటేరియట్ లోపలికి వచ్చే వాహనాలు, బయటికి వెళ్లే వాహనాలను తనిఖీలు చేయాలని భద్రతా సిబ్బంది ఆదేశించింది. ప్రత్యేకంగా సచివాలయం నుంచి బయటకు వెళ్లే వాహనాలపై దృష్టి పెట్టాలంది. సాధారణంగా ఎన్నికలు ముగిశాక ఫలితాలు రావడానికి ముందు జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ) ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.
Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..