పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం లభ్యం.. దాని విలువ రూ.5.6 కోట్లు

Gold seized: వారు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు..

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. రూ.5 కోట్ల 60 లక్షల విలువచేసే 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 46 కిలోల వెండిని సీజ్ చేశారు.

ఈ బంగారం, వెండిని బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనంలో కొందరు అనుమతులు లేకుండా తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. వారు కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకున్నారని చెప్పారు.

ఆ తర్వాత ఆ వాహనంలో తనిఖీలు చేసినట్లు వివరించారు. ఆ వాహనాన్ని ఆర్డీవో కార్యాలయానికి తరలించామని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఎన్నికల వేళ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పెద్దాపురంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడడం గమనార్హం. ఈ బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇప్పట్లో తగ్గే ప్రసక్తే లేదా? మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్రెండింగ్ వార్తలు