×
Ad

Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

Special Trains ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైలు సర్వీ సులు నడపనున్నట్లు

Special Trains

Special Trains : ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్యే శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్, వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగల నేపథ్యంలో పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను తిప్పచనుంది.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైలు సర్వీ సులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
♦ చర్లపల్లి-బ్రహ్మపూర్ (07027) ప్రత్యేక రైలు డిసెంబర్ 12 నుంచి జనవరి 30 వరకు ప్రతి శుక్రవారం.
♦ డిసెంబర్ 6 నుంచి జనవరి 31 వరకు బ్రహ్మపూర్-చర్లపల్లి (07028) రైలు ప్రతి శనివారం.
♦ డిసెంబర్ 6 నుంచి జనవరి 17 వరకు చర్లపల్లి-అనకాపల్లి (07035) ప్రతి శనివారం.
♦ అనకాపల్లి-చర్లపల్లి (07036) డిసెంబర్ 7 నుంచి జనవరి 18 వరకు ప్రతి ఆదివారం.
♦ జాల్నా-ఛప్రా (07651) డిసెంబర్ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం.
♦ ఛప్రా-జాల్నా (07652) డిసెంబర్ 5 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం నడపనున్నారు.

♦  మరోవైపు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – అనకాపల్లి మార్గంలో 34 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 4వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 26వ తేదీ వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతి గురువారం ప్రత్యేక రైలు (07055 నెంబర్) అనకాపల్లికి బయలుదేరుతుంది. అదేవిధంగా డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 27వరకు ప్రతీ శుక్రవారం అనకాపల్లి నుంచి ప్రత్యేక రైలు (07056 నెంబర్) నడుస్తాయని తెలిపారు. మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

♦ మరోవైపు.. తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు శాశ్వత అదనపు కోచ్ లను ఏర్పాటు చేసినట్లు తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ -తిరుపతి (20701), తిరుపతి – సికింద్రాబాద్ (20702) నంబర్లు కలిగిన ఈ రైళ్లకు ఇప్పటికే ఏసీ చైర్‌కార్‌లు 14ఉండగా ఆ సంఖ్యను 18కి పెంచారని తెలిపారు. కాగా ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఎప్పటిలాగానే రెండు కోచ్ లతో నడస్తుందన్నారు. అయితే, పెంచి కోచ్ లు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.