Tirumala
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారిని సర్వదర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయాల నిర్మాణంతో తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాలు ఆధ్యాత్మిక పరిమళాలతో సుసంపన్నం కానున్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రం, శ్రీవారి ఆలయానికి నూతనంగా స్థానిక సలహా మండలి సభ్యులుగా నియమితులైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు వైవీ సుబ్బారెడ్డి.
Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు
చెన్నై ఈసీఆర్ లో తమిళనాడు ప్రభుత్వం మంజూరు చేసిన రెండు స్థలాల్లో ఈ ఏడాది ఆఖరులోగా ఒక దాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మధురైలో సిద్ధంగా ఉన్న రెండు ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుందని చెప్పారు. ఊలందూరు పేటలో ఆలయ నిర్మాణం కోసం టెండర్లు ఖరారైనట్టు వివరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
చెన్నై టీ నగర్ లో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన శ్రీవారి ఆలయాన్ని మరింత విస్తరించి భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. జమ్ములో 66 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలియజేశారు. చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్ లో కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మార్గమధ్యంలో నాలుగు ప్రాంతాల్లో విశ్రాంతి గదులు నిర్మించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఊత్తుకోట, సితమంజేరిలో పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.
WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!
పేదలకు అందుబాటులో ఉండేలా చెన్నై రాయపేటలోని టీటీడీ స్థలంలో కల్యాణ మండపాన్ని త్వరలో నిర్మిస్తామని చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ అన్నారు. చెన్నై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఈ ఏడాది శ్రీవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహోత్సవాలకు సీఎం స్టాలిన్ ను ఆహ్వానించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఎన్ని ఆలయాలు వచ్చినా భక్తుల మనోభావాలకు అనుగుణంగా చెన్నై టి.నగర్ లోని శ్రీవారి ఆలయాన్ని కొనసాగించి, మరింత విస్తరిస్తామని తెలిపారు.