Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు

కారంపొడి అధికంగా ఉండే ఆహారాలను తింటే వికారంగా ఉంటుంది. కారం పొడి అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో పూత ఏర్పడడం, పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి..

Chilli : మిరప కారం అధికంగా తింటే… వృద్ధాప్య ఛాయలు

Chilli Powder

Chilli : ఎర్రటి మిరప కారాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కారంతో కూడిన ఆహార పదార్ధాలను, పచ్చళ్ళు, కూరలు, స్పైసీ ఐటమ్స్ ను తినేందుకు ఆసక్తి చూసిస్తుంటారు. మిరపకాయ కారం కూర లో వేస్తే ఆ కూరకు మంచి రుచివస్తుంది. తీపి పదార్థాలు తిన్నాక తప్పనిసరిగా కారంతో కూడిన స్పైసీగా హాట్ గా ఉండే పదార్ధాలను తినటం అలవాటు. అయితే ఈ కారంపొడి అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ఇబ్బందులు కలుగుతాయి. కారంను ఆహారంలో వినియోగించే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

ఎర్ర కారం పొడిని అధికంగా తీసుకున్నట్లయితే గుండెల్లో మంట, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కారం పొడిని అధికంగా కూరలలో ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆహారంలో పోషకాలను నాశనం చేసే శక్తి కారంపొడిలో ఉంటుంది. కారం ఎక్కువగా తినటం వల్ల పెద్దపేగుకు పుండ్లు ఏర్పడతాయి. ఫలితంగా డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కారంపొడి అధికంగా ఉండే ఆహారాలను తింటే వికారంగా ఉంటుంది. కారం పొడి అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో పూత ఏర్పడడం, పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి.. కారం వల్ల నోటి సంబంధిత సమస్యలు కూడా రావడం గమనార్హం. ఎర్ర మిరపకాయ కారం ఎక్కువగా వాడడం వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఆస్తమాతో బాధపడే వారికి మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.

ఇక వీటితో పాటు గర్భధారణ సమయంలో శిశువుకి సమస్యలు తలెత్తుతాయి. ఎర్ర మిరపకాయను అధికంగా ఉపయోగించడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది కడుపులో మంటను కూడా కలిగిస్తుంది. కారం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరంలో తొందరగా ముసలితన ఛాయలు వచ్చేస్తాయి. కారం మితంగా తింటే ఔషధంగా పనిచేస్తుంది. విపరీతంగా తింటే మాత్రం తొందరగా వృద్దాప్యం వచ్చే అవకాశాలు ఉంటాయి.