WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

వాట్సాప్‌ తమ యూజర్లను హెచ్చరిస్తోంది. వాట్సాప్ లో మెసేజ్ లను డిలీట్ చేసిన తర్వాత వాటిని రికవరీ చేసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడుతున్నారు

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

Whatsapp Users Beware Of Th

WhatsApp Alert : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ తమ యూజర్లను హెచ్చరిస్తోంది. వాట్సాప్ లో మెసేజ్ లను డిలీట్ చేసిన తర్వాత వాటిని రికవరీ చేసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడుతున్నారు యూజర్లు. ఇందుకోసం వాట్సాప్ యూజర్లు ఎక్కువగా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ ద్వారా థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లకు మీ విలువైన డేటా చిక్కే ప్రమాదం ఉందని వాట్సాప్ హెచ్చరిస్తోంది.

వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజ్ లను తిరిగి పొందేందుకు ఈ యాప్స్ వాడేవారే ఎక్కువనని ఓ నివేదిక తెలిపింది. అందులో ఎక్కువగా వాట్సాప్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకునే యాప్.. WAMR App.. వాట్సాప్ డేటా రికవరీ థర్డ్ పార్టీ యాప్స్‌లలో WAMR అనేది ఫేమస్. ఇప్పటివరకూ ఈ యాప్ 50లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లకు డేటా ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ యాప్ ద్వారా డేటా బయటకు వెళ్లే ప్రమాదం ఉందని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ యూజర్ల ఇంటర్నెట్ ప్రైవసీని దెబ్బతీస్తుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. వాట్సాప్ లో వచ్చే మెసేజ్ లన్నీ ఎన్ క్రిప్ట్ అయి ఉంటాయి. ఈ ఎన్ క్రిప్ట్ చేసిన మెసేజ్‌లను ఇతరులు చూడలేరు. WAMR App చాట్ చేసిన మెసేజ్‌లు సర్వర్లలో స్టోర్ అయ్యే అవకాశం ఉంది. మీ డేటా ఇతరులు తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ(IICS)కు చెందిన సైబర్ సెక్యూరిటీ ప్రకారం.. ఈ యాప్ సెట్టింగ్స్ మీ ఫోన్లో Allow పర్మిషన్ ఇవ్వకూడదు. అలాగాని చేస్తే.. మీ డేటాకు ముప్పు ఏర్పడే అవకాశం హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ కు పర్మిషన్ ఇవ్వడం ద్వారా గ్యాలరీ, నెట్ వర్క్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనుమతి ఇవ్వడం ద్వారా మీ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మీ విలువైన డేటాకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read Also : Flipkart Big Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్‌లో భారీ సేల్.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!