APPSC Job notifications
APPSC Job notifications: ఏపీలోని కూటమి ప్రభుత్వం (Andhrapradesh government ) నిరుద్యోగుల(unemployed)కు తీపికబురు చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు శాఖల్లో 21 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) ఆగస్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వ్యవసాయశాఖలో మొత్తం 10 (జోన్-1లో ఎనిమిది, జోన్-3లో రెండు) అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆగస్టు 19నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన వారు ఈనెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
భూగర్భజల శాఖలోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భూగర్భజల విభాగం జోన్-4లో నాలుగు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను జాబ్ నోటిఫికేసన్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజాబాబుఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.