Gossip Garage : ఏ మూలన ఏ భూమి ఉంది. అసైన్డ్, అటవీ, ఫ్రీహోల్డ్ భూములు.. రికార్డుల గోల్‌మాల్‌పై ఫైల్స్ రీఓపెన్ చేస్తోంది కూటమి సర్కార్. కబ్జాల కథేంటో తేల్చే పనిలో ఉంది. ప్రతీ ఇంచు భూమిపై రీవెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తోంది. భూముల లెక్కలు పక్కా చేయడంతో పాటు..గత ఐదేళ్లలో జరిగిన భూబాగోతాన్ని బయట పెడుతామంటోంది ప్రభుత్వం. కూటమి టార్గెట్ ఎవరు.? భూరికార్డుల రీవెరిఫికేషన్‌తో దొరికిపోయేదెవరు.?
భూమాయ.. భూరికార్డుల గోల్‌మాల్‌పై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. కబ్జాలు, ఆక్రమణల లెక్కేంటో తేల్చేందుకు సిద్ధమైంది. ప్రతీ ఇంచు జాగ లెక్క తేలాల్సిందేనని.. గత ఐదేళ్లలో జరిగిన కబ్జాల బాగోతం మొత్తం బయటికి రావాల్సిందేనని అంటోంది. ఏ సర్వే నెంబర్ ఎవరి పరిధిలో ఉంది..ఏ భూమి ఏ డిపార్ట్‌మెంట్ పరిధిలో ఉంది..అసైన్డ్ ఎంత..అటవీ భూమి ఎంత అని రికార్డుల తిరిగేస్తుంది. వైసీపీ హయాంలో ప్రైవేట్ ల్యాండ్ కబ్జాలు అయ్యాయని అంటోంది కూటమి సర్కార్.
Also Read : వైసీపీ నేతలను దగ్గరికి కూడా రానివ్వొద్దు, వారితో సంబంధాలు పెట్టుకోవద్దు- టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
భూకబ్జా నిరోధక చట్టం..
జగన్ హయాంలో ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలకు లెక్కేలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కూడా ఫ్రీహోల్డ్ చేసి వైసీపీ నేతల పేర్ల మీద రాసుకున్నారని అలిగేషన్స్ చేస్తున్నారు. 13లక్షల ఎకరాలకు పైగా ఫ్రీహోల్డ్ చేయగా అందులో 5 లక్షలకు ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించారట. 8వేల ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయ్యాయని ఐడెంటిఫై చేశారట. అందుకే భూకబ్జా నిరోధక చట్టాన్ని తీసుకురావడంతో పాటు..భూమాయకు సంబంధించి పీడీ యాక్టును కూడా అమలు చేయబోతున్నారట.
ఇక భూసర్వే కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గత సర్కార్ మిస్ యూజ్ చేసిందంటోంది కూటమి. భూసర్వేను అస్త్రంగా చేసుకుని వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేశారని..పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. గత ప్రభుత్వంలో 40 వేల ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకు అమ్ముకున్నారని..జీవో 596 తెచ్చి అసైన్డ్ భూములను తమకు కావాల్సిన వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం చేసిన సర్వేను రద్దు చేసి, టెక్నాలజీ సాయంతో సర్వేకు ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని కోరారు టీడీపీ ఎంపీ.
గత ఐదేళ్లలో అడ్డగోలుగా భూబాగోతం?
గత ఐదేళ్లలో నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా అడ్డగోలుగా భూబాగోతం నడిచిందనేది కూటమి సర్కార్ అనుమానమట. అందుకు తగ్గట్లుగానే ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయట. అందుకే అప్పటి ఆక్రమణలు, మ్యాటరేంటో తేల్చేందుకు స్పెషల్ టీమ్‌లను ఫీల్డ్‌లోకి దించిందిట కూటమి సర్కార్.
గ్రామం, మండలం, జిల్లాస్థాయితో పాటు రాష్ట్రస్థాయిలో ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచరగణంతో చెలరేగిపోయారట. అప్పటి బాధితులందరికీ ఇప్పుడు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారట. విశాఖలో ప్రైవేటు భూముల ఆక్రమణ నుంచి అనంతపురంలో కియాకు బెదిరింపుల దాకా..చాలా అంశాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ చేరిందంటున్నారు.
Also Read : ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. చేతిలో దీపం కూడా లేదు.. కానీ.. అంటూ మరోసారి ఆ డైలాగ్ చెప్పిన పవన్ కల్యాణ్
ఇక వైసీపీ అధినేత జగన్, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూకభ్జా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన భూములపై సర్వే చేశారు అటవీ అధికారులు. ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించినట్లు గుర్తించారని టాక్ వినిపిస్తోంది. నెల రోజుల కిందే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల లెక్క తేల్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
బినామీ పేర్లతో వందల ఎకరాలు ఆక్రమణ?
చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూకబ్జా అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు. అంతేకాదు పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు, బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అటవీ భూములు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రెండు నెలల కిందే విచారణ జరిపించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇలా గ్రామస్థాయి..వైసీపీ టాప్ లీడర్ల టార్గెట్‌గా భూఆక్రమణల లెక్కేంటో తేల్చే పనిలో పడిందట కూటమి సర్కార్. వైసీపీ హయాంలో జరిగిన భూసర్వేలో తప్పులను ఎత్తిచూపుతూ..మళ్లీ రీసర్వే చేపట్టేందుకు రెడీ అవుతోంది. కూటమి ప్రభుత్వం రికార్డుల రీవెరిఫికేషన్ చేస్తే వైసీపీ నేతలు కార్నర్ అవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.