Gossip Garage : అన్నీ గమనిస్తున్నా..నోరు జాగ్రత్త..మనం వాళ్లలా కాకూడదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సుతిమెత్తగా, సున్నితంగా ఇచ్చిన వార్నింగ్ ఇది. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దంటూ..నేతలకు చిన్న క్లాస్ పీకారు. మీరంతా మళ్లీ గెలిచి రావాలని చెప్తూనే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పనితీరే గీటురాయి అని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే పట్టుదలతో పని చేయండని సూచించారు. రాబోయే ఎలక్షన్స్ కోసం టీడీపీ అధినేత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? పార్టీ నేతల మీటింగ్‌లో విపక్ష నేతను ఎందుకు టార్గెట్ చేసినట్లు?
అధికారంలో ఉన్నాం. అడ్డగోలుగా బిహేవ్ చేస్తామంటే కుదరదు. ప్రజలిచ్చిన పదవులను బాధ్యతగా నిర్వహించాలంటూ..టీడీపీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు టాక్. నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు చెప్పిన చంద్రబాబు..అందరి లెక్కలు తన దగ్గరున్నాయని అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అందరం మునుగుతామంటూ గట్టిగానే చెప్పిన చంద్రబాబు..
వ్యక్తిగత అవసరాలు, పదవులు, ఒకరి మీద మరొకరి ఆధిపత్యం కంటే పార్టీనే ముఖ్యమని తేల్చేశారు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారట. గ్రూపు రాజకీయాలొద్దని..పార్టీని నిర్లక్ష్యం చేస్తే అందరం మునుగుతామంటూ గట్టిగానే చెప్పినట్లు తెలిసింది.
Also Read : ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు.. ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు
ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని సూచించారు. నేతలు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నానన్న చంద్రబాబు..అందరూ మళ్లీ గెలిచేలా పనిచేయాలన్నారు. త్వరలోనే కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతానని.. పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు దిశానిర్ధేశం చేశారట చంద్రబాబు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకు వచ్చామా వెళ్లామా అన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని సూచించారు.
నా గురించి సీనియర్ ఎమ్మెల్యేలకు బాగా తెలుసంటూ హింట్..
వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని ఇండైరెక్టుగా ఇండికేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. పనితీరు బాలేని వారికి సీట్లు ఇవ్వడం కుదరదని చెప్పకనే చెప్పారని నేతలు చర్చించుకుంటున్నారు. మళ్లీ అసెంబ్లీకి రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని..కొత్త ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారట.
ఏ మాత్రం తేడా వచ్చినా బాగుండదని..తన గురించి సీనియర్ ఎమ్మెల్యేలకు బాగా తెలుసంటూ జూనియర్ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారట బాబు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలంతా సభలో ఉండాల్సిందేనని కూడా తేల్చి చెప్పారట.
పొరపాట్లు చేసి ప్రతిపక్షం అస్త్రంగా మలుచుకునే అవకాశం ఇవ్వొద్దని సూచించినట్లు తెలిసింది. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు చేస్తే మనకు వాళ్లకు తేడా ఏంటో మీరే చెప్పండంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించారట బాబు. పనిలో పనిగా మాజీ సీఎం జగన్ ప్రస్తావన తెచ్చారట.
2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారని..రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు, కుట్రలు ఎలా ఉంటాయో..ఆ ఘటన ఓ కేస్ స్టడీ అని చెప్పారట చంద్రబాబు.
Also Read : వైసీపీలో వరుస అరెస్ట్‌లు.. అసలు రీజన్ అదేనా? నెక్స్ట్ జైలుకెళ్లేది ఎవరు..
వివేకా హత్య మొదలు..గులకరాయి ఘటన వరకు డిటేయిల్‌గా వివరించారట. వివేకా హత్య అప్పటి ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు రావడానికి ఓ కారణమైందని కూడా బాబు అన్నట్లు నేతలు చెబుతున్నారు. నిఘా వ్యవస్థ కూడా కొందరి కుట్రలను పసిగట్టలేకపోయిందని.. సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో డ్యామేజీ జరిగిందని చెప్పుకొచ్చారట టీడీపీ అధినేత.
రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటి ఆలోచనలే చేస్తారు..!
మళ్లీ 2024 ఎన్నికల ముందు గులకరాయి డ్రామా ఆడారని గుర్తు చేశారట చంద్రబాబు. ఇటీవల వైసీపీ అధినేత ఇంటి ముందు గడ్డి తగలబడితే దాన్నీ రాజకీయం చేయాలని చూశారని..రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటి ఆలోచనలే చేస్తారని ఎమ్మెల్యేలకు చెప్పారట. వారి కుట్రలను, ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారట చంద్రబాబు.
ఈసారి పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి చాలా అలర్ట్‌గా ఉంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేది మంత్రులు, ఎమ్మెల్యేలే కాబట్టి వారి పనితీరు, బిహేవియర్ బాగుండేలా సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్ధేశం చేస్తూ వస్తున్నారు. పద్దతి మార్చుకోవాలంటూ ..మంత్రులు, ఎంపీలకు కూడా రెండు నెలల క్రితమే క్లాస్ పీకారు చంద్రబాబు.
మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి ఓ సీఐ విషయంలో ప్రవర్తించిన తీరుతో పాటు..ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం, మరో మంత్రి వాసంశెట్టి సుభాష్, లేటెస్ట్‌గా కొలికపూడి, ఆ తర్వాత డిజిటల్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి విషయంలో ఎప్పకప్పుడు మందలిస్తూ వస్తున్నారు. ఒకటికి రెండుసార్లు చెప్పినా పద్దతి మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సి వస్తుందని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు చంద్రబాబు. ఇలా రాబోయే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపర్ చేస్తున్నారు.