Cm Chandrababu : ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు.. ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు

ఈ మేరకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.

Cm Chandrababu : ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు.. ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు

Updated On : March 1, 2025 / 5:27 PM IST

Cm Chandrababu : ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి రెండు ప్రసవాలకు ఇకపై 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలు అందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యూటీ చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సర్వీస్ ముగింపు సమయంలో గ్రాట్యూటీ కింద సుమారు 1.5 లక్షలు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.

Also Read : పోసాని కృష్ణమురళికి అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 42 వేల 752 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. వీరిలో గ్రామాల్లో 37వేల 017 మంది… ప‌ట్ట‌ణాల్లో 5వేల 735 మంది ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వారికి లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

 

ప్రస్తుతం ఆశా వర్కర్లు నెలకు 10వేలు వేతనం పొందుతున్నారు. వారి సర్వీస్ ముగింపు సమయంలో గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందే అవకాశం ఉంటుంది.

ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు, గరిష్ట వయోపరిమితి పెంపు, ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యూటీ చెల్లింపు నిర్ణయంపై ఆశా వర్కర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారంతా ధన్యవాదాలు తెలుపుతున్నారు. గ్రాట్యూటీ ఎన్నో సంవత్సరాల కల అని, ఇవాళ ఫలించిందని ఆశా కార్యకర్తలు అంటున్నారు.