Vijayasai Reddy: నో పాలిటిక్స్..ఓన్లీ అగ్రికల్చర్ అన్నారు. కానీ అప్పుడప్పుడు తన ట్వీట్లతో చర్చకు తెరలేపుతున్నారు. కొన్నిసార్లు పొలిటికల్ రిలేటెడ్ ట్వీట్లు చేసినా..ఇప్పుడాయన పూర్తిగా పబ్లిక్ వాయిస్‌గా మారిపోయారు. ఇలా అయితే బాగుంటుంది. అలా చేస్తే అందరికీ మేలు అన్నట్లుగా లైటర్ వేలో ట్వీట్స్ చేస్తూ చర్చకు తెరలేపుతున్నారు. లేటెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ సలహా ఇస్తూ..ఆ మాజీ ఎంపీ చేసిన పోస్ట్ చర్చకు దారితీస్తోంది. ఇంతకు ఎవరా నేత? ఆయన రూట్ ఏంటి?
ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్.2గా ఆయన మాట చెల్లుబాటు అయింది. కూటమి పవర్‌లోకి వచ్చాక..వైసీపీకి గుడ్‌బై చెప్పి..పాలిటిక్స్‌కు కూడా దూరంగా ఉంటానని ప్రకటించారు. రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు. ఇక నో పాలిటిక్స్ ఓన్లీ అగ్రికల్చర్ అని చెప్పిన విజయసాయి..ట్విట్టర్‌లో మాత్రం అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేస్తూ చర్చకు దారితీస్తున్నారు. ఆ మధ్య వైసీపీ అధినేత జగన్‌కు..ఆయన చుట్టూ ఉన్న నేతలకు కౌంటర్‌గా కొన్ని ట్వీట్స్ చేసిన విజయసాయి..కొద్దిరోజులుగా పూర్తిగా పబ్లిక్ వాయిస్‌గా మారిపోతున్నారు.
ఇష్యూ ఏదైనా..మ్యాటర్ మరేదైనా..పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా వైజాగ్ లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబుకు ఓ కీలక సలహా ఇచ్చారాయన. పెట్టుబడుల సదస్సు ద్వారా వచ్చిన ప్రతిపాదనల్ని గ్రౌండింగ్ చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.
సీఐఐ సదస్సులో ఏపీకి వచ్చిన పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయని నిర్ధారించుకోవడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు విజయసాయిరెడ్డి. పారదర్శకత కోసం రియల్-టైమ్ గ్రౌండింగ్ కోసం ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడే పబ్లిక్ డౌట్స్ క్లారిఫై అవుతాయని సజీషన్ ఇచ్చారు. అలాగే సీఐఐ సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో 75% లేదా 10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయినా, ఏపీ రూపురేఖలే మారిపోతాయన్నారు. నెక్స్ట్ జనరేషన్..సిద్ధంగా ఉన్న ఏపీని చూడాలని కోరుకుంటున్నట్లు సాయిరెడ్డి చెప్పారు.
అయితే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ అటు వైసీపీలో..ఇటు టీడీపీలో చర్చకు దారితీస్తోంది. ఉన్నట్లుండి చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ట్వీట్‌లో అపర్ధాలు తీయడానికేం లేదని అంటున్నారు. ఏపీ బాగుండాలి. అభివృద్ధి జరగాలి. సేమ్‌టైమ్ పబ్లిక్ డౌట్స్ క్లారిఫై చేయాలన్నట్లుగా జనం దృష్టి నుంచే ట్వీట్ చేశారన్న టాక్ నడుస్తోంది.
పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రియాక్షన్..
అధికారం, అపోజిషన్ అని తేడా లేకుండా విజయసాయిరెడ్డి ఇప్పుడు అన్ని పార్టీలకు దూరంగా ఉంటున్నారు. తన పని చేసుకుంటూ కాంటెంపరరీ ఇష్యూస్ మీద అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నారు. అవి కూడా పొలిటికల్ అంశాలు కాకుండా..అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాజెక్టులపై తన ఒపీనియన్, సజీషన్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఎంతైనా పొలిటికల్ యాక్టీవ్‌గా పని చేసి..ఆల్ ఆఫ్ సడెన్‌గా రాజకీయాలకు దూరంగా ఉండటం అంత ఈజీ కాదు. విజయసాయి కూడా పాలిటిక్స్, కాంట్రవర్సీ ఇష్యూస్ జోలికి వెళ్లకుండా..పర్టిక్యులర్‌గా కొన్ని టాపిక్స్ మీదే రెస్పాండ్ అవడం ఆసక్తికరంగా మారింది. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన స్పందిస్తుండటంతో సోషల్ మీడియాలోనూ విజయసాయిరెడ్డికి మద్దతు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి ఎలాంటి రోల్ ప్లే చేస్తారో వేచి చూడాలి.
Also Read: అల్లుడికి విషెస్ సరే.. సునీతకు ఓదార్పు ఏది? బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా తలసాని తీరు..