Tdv Vs Bjp For Ash (Photo Credit : Google)
Gossip Garage : ఇలాఖ పంచాయితీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏ బిడ్డా ఇది నా అడ్డా అని ఆ ఇద్దరు నేతలు రచ్చకెక్కడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో ఆగకుండా బూడిద రగడ రచ్చకెక్కింది. ఓ టీడీపీ నేత, బీజేపీ ఎమ్మెల్యే డస్ట్ కోసం నువ్వా నేనా అన్నట్లుగా తగ్గేదేలే అంటున్నారు. టీడీపీ నేత అయితే ఏకంగా తానే రంగంలోకి దిగుతానంటుంటే..బీజేపీ ఎమ్మెల్యే మాత్రం అనుచరులను ఫీల్డ్‌లోకి దింపి రచ్చ చేస్తున్నారు. ఆ రెండు రాయలసీమ జిల్లాల సరిహద్దుల్లో పోలీస్ పహారా..టెన్షన్ సిచ్యువేషన్స్‌తో ఆ ఇద్దరి కుస్తీ కాస్త..డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఇంతకీ ఆ ఇద్దరి బూడిద గొడవ ఏంటి.? డస్ట్ వార్ సెట్ అయ్యేది ఎట్లా.?
జేసీ, ఆది వర్గాల మధ్య వివాదం..
అప్పుడు దోస్తీ.. ఇప్పుడు కుస్తీతో ఆ ఇద్దరి నేతల పంచాయితీ రచ్చ రంబోలా అవుతోంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య గొడవ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంపై జేసీ బ్రదర్స్..ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో నువ్వానేనా అన్నట్లుగా ఫీల్డ్‌లోకే దిగారు ఇద్దరు నేతల అనుచరులు. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తానే రంగంలోకి వస్తానని చెప్పి హీట్ క్రియేట్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాత్రం అనుచరులతోనే తతంగమంతా నడిపిస్తున్నారు.
RTPP ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంపై గొడవ…
రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో ప్రతీ నిత్యం దాదాపు 4వేల టన్నుల ఫ్లైయాష్ పౌడర్ ఉత్పత్తి అవుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సిమెంటు ఫ్యాక్టరీలకు సప్లై చేసే వారట. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బూడిద తోలుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం మొదలైంది. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలకు వెళ్లకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.
ఇదే నేపథ్యంలో తాడిపత్రి నుంచి ప్రభాకర్‌రెడ్డి తన వర్గీయులతో ఆర్టీపీపీ దగ్గరకు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండ్రోజులుగా ఆర్టీపీపీ, తాడిపత్రి మార్గంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గీయులు గొడవ పడతారని భావించి నిఘా పెట్టారు. తమ వాహనాల్లో బూడిదను నింపకపోతే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానంటూ వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీకి ప్రభాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ ఏర్పడింది.
ముదిరిన బూడిద వివాదం..
ఫ్లైయాష్ తరలింపు విషయంపై ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గాల మధ్య రెండ్రోజులుగా చర్చలు జరిగాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. అంతలోనే వివాదం పెద్దదై ముదిరిపోయింది. జేసీ దివాకర్‌రెడ్డి వాహనాలు ఆర్టీపీపీకి వస్తున్నాయని తెలిసి అక్కడ భారీగా మోహరించారు ఆదినారాయణరెడ్డి వర్గీయులు. పరిస్థితి చేయిదాటిపోతే రెండు వర్గాలు..ఇద్దరు నేతలు ఆర్టీపీపీ దగ్గర ఎదురెదురు పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు..అనంతపురం, కడప జిల్లా బోర్డర్ అయిన కొండాపురం మండలంలో చెక్‌పోస్ట్ పెట్టారు. దాంతో ఆ గట్టున జేపీ వర్గీయులు..ఈ గట్టున ఆది వర్గీయులు అన్నట్లుగానే కంటిన్యూ అవుతోంది పరిస్థితి.
ఆది వర్గం లారీలు తాడిపత్రికి వస్తే ఊరుకునేది లేదంటున్న జేసీ వర్గం..
బూడిద తమ దగ్గర ఉంది కాబట్టి తమ వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి తమ వాహనాల్లోనే తీసుకెళ్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పంచాయతీ పెరిగిపోయింది. జేసీ వాహనాలు వస్తే అడ్డుకుని తీరుతామంటూ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు తగ్గేదేలే అంటున్నారు. ప్రస్తుతానికి పోలీసులు పహారా పెట్టి గొడవ జరగకుండా చూస్తున్నారు. కానీ జేసీ ప్రభాకర్‌రెడ్డి లారీలు వెళ్తే ఎమ్మెల్యే ఆది వర్గం అడ్డుకునే అవకాశం ఉంది. ఆది నారాయణరెడ్డి లారీలు తాడిపత్రికి వస్తే ఊరుకునేది లేదంటోంది జేసీ వర్గం. దీంతో హైటెన్షన్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి.
బూడిద వివాదం కూటమి పెద్ద నేతల దాకా వెళ్లినట్లు టాక్..
ఈ ఇద్దరి ఇష్యూతో మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారట. ఏ నేత వర్గం అనుచరులను ఏమన్నా..తమకు తలనొప్పిగా మారిందని భావిస్తున్నారట ఖాకీలు. అయితే బూడిద పంచాయితీ పెద్దది అయి..హడావుడి కావడంతో వివాదం కూటమి పెద్దనేతల దాకా వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. కూర్చొని మాట్లాడుకుని ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలని..రోడ్డుకు ఎక్కి రచ్చ చేయొద్దని ఇద్దరు నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ డస్ట్ గొడవ సమసిపోతుందా.? ఇద్దరు నేతల ఇలానే రాస్తా పే సవాల్ అని పంచాయితీకి దిగుతానే ఉంటారా అనేది వేచి చూడాలి.
Also Read : బూడిద కోసం సై అంటే సై అంటున్న టీడీపీ నేత, బీజేపీ ఎమ్మెల్యే..! వివాదం ఏంటి?
Also Read : కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్పటి సీఐడీ చీఫ్‌కు చిక్కులు తప్పవా? ఆ పెద్ద నేతే టార్గెట్టా?