Gossip Garage : కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్పటి సీఐడీ చీఫ్‌కు చిక్కులు తప్పవా? ఆ పెద్ద నేతే టార్గెట్టా?

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకే అప్పగించేవారట.

Gossip Garage : కస్టోడియల్ టార్చర్ కేసు.. అప్పటి సీఐడీ చీఫ్‌కు చిక్కులు తప్పవా? ఆ పెద్ద నేతే టార్గెట్టా?

RRR Custodial Torture Case (Photo Credit : Google)

Updated On : November 27, 2024 / 11:45 PM IST

Gossip Garage : ఆయన అరెస్ట్ అప్పుడు ఓ సంచలనం. పోలీసులు ఆయనను ట్రీట్‌ చేసిన విధానం కూడా హాట్ టాపికే. సిట్టింగ్‌ ఎంపీనే ఓ కేసులో అరెస్ట్ చేసి అడ్డగోలుగా టార్చర్ పెట్టారన్న వార్తలు ఏపీ పాలిటిక్స్‌నే షేక్ చేశాయి. అందుకు తగ్గట్లుగా ఆ నేత ఆధారాలు కూడా రెడీ చేసి పెట్టారు. గత సర్కార్‌లో ఆ పోలీస్ విభాగం ఆఫీసర్‌గా ఉండి సిట్టింగ్‌ ఎంపీని టార్చర్‌ పెట్టిన ఆ అధికారి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్నారు. ఆ తర్వాత అప్పటి సీఐడీ బాస్‌ను కూడా రౌండప్‌ చేసే అవకాశం ఉంది. ఇద్దరు అధికారులకు ఆదేశాలిచ్చిన ఓ పెద్ద నేత కథేంటో కూడా బయటికి తీయాలని ఫిక్స్ అయ్యారట. ఆ మాజీ ఎంపీ కస్టోడియల్ టార్చర్‌ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆ పెద్ద ఆఫీసర్‌కు కటకటాలు తప్పవా? అప్పటి ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ నేత వరకు వ్యవహారం వెళ్తుందా.?

నెక్స్ట్ సునీల్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు..!
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో అసలు ఎపిసోడ్‌ స్టార్ట్ అయింది. ఆయనను విచారించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న విజయ్‌పాల్‌ అరెస్ట్‌ అయ్యారు. దర్యాప్తు స్పీడప్ కావడంతో..ఇప్పుడు అందరి వేళ్లు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌ వైపు చూపుతున్నాయి. సునీలే సూత్రధారి..ఆయన్ను వదలొద్దంటున్నారు రఘురామకృష్ణరాజు. దీంతో నెక్స్ట్ సునీల్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కస్టడీలో విజయ్‌పాల్‌ చెప్పిన వివరాల ఆధారంగా సునీల్‌ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. అందుకే సునీల్‌పై లుక్‌ ఔట్ నోటీసులు రిలీజ్ చేయాలంటున్నారు రఘురామకృష్ణరాజు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఓ ముఠా అని మండిపడ్డ రఘురామ..సునీల్‌ దేశం విడిచి పారిపోకుండా చూడాలంటున్నారు.

చిత్రహింసలు పెడుతూ వైసీపీ పెద్దలకు లైవ్‌ చూపించారా?
రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటివరకూ మూడుసార్లు విచారణకు హాజరైన విజయ్‌పాల్‌..విచారణకు ఏ మాత్రం సహకరించ లేదంటున్నారు అధికారులు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు..గుర్తులేదు..మరిచిపోయా అన్నట్లుగానే సమాధానం ఇచ్చారట. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి రెస్పాండ్ కాలేదట. దీంతో చివరికి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇక నెక్స్ట్‌ రౌండప్‌ అయ్యేది అప్పుడు సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీలే అంటున్నారు. వైసీపీ పెద్దల డైరెక్షన్‌లో సునీల్‌ అడ్డగోలుగా వ్యవహారించారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెడుతూ వైసీపీ పెద్దలకు లైవ్‌ వీడియో చూయించారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్‌ పాల్ అరెస్ట్ అవడం సంచలనం రేపుతోంది.

రఘురామకృష్ణరాజును టార్చర్‌ చేయాలని చెప్పిందెవరు?
కస్టడీలో ఆయన చెప్పే వివరాల ఆధారంగా సునీల్‌ను కూడా అరెస్ట్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. తర్వాత విజయ్‌పాల్‌, సునీల్‌ను విచారించి..రఘురామకృష్ణరాజును టార్చర్‌ చేయాలని చెప్పిందెవరు? ఎవరి ఆదేశాలతో ఆయనను చిత్రహింసలు పెట్టారనే దానిపై వివరాలు సేకరించనున్నారు. అంతేకాదు టార్చర్ పెడుతున్నట్లు ఏ వైసీపీ నేతకు లైవ్‌ వీడియో చూపించారనే విషయాలపై ఆరా తీయనున్నారు. ఒకవేళ సునీల్‌ అరెస్ట్ అయితే మాత్రం ఈ వ్యవహారం వైసీపీ టాప్‌ లీడర్ల వరకు వెళ్తుందన్న ప్రచారం జరుగుతోంది. అప్పటి సీఎంతో పాటు ఆయనకు అతి సన్నిహితంగా ఉన్న సలహాదారుడికి కూడా ఉచ్చు బిగియక తప్పదని ఇన్‌సైడ్‌ టాక్.

సునీల్‌ అరెస్ట్ అయితే వైసీపీ టాప్‌ లీడర్ల వరకు వ్యవహారం..
వైసీపీ ముఖ్యనేతల పాత్ర ఉందని క్లారిటీ వచ్చాకే కస్టోడియల్ టార్చర్ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టుగా సీఎం చంద్రబాబే పోలీస్‌ అధికారులకు క్లియర్‌ కట్‌గా ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పక్కా ఎవిడెన్స్ ఉన్నాక..గత ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో పనిచేసిన అధికారులు, ఆ పెద్ద లీడర్లపై యాక్షన్‌ తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని బాబు ఆఫీసర్లను క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు చేసి..వాస్తవాలు తేల్చి..కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఎవరున్నా వదిలిపెట్టొదని చెప్పినట్లు టాక్. అందుకే సీఐడీ సీరియస్‌గా ఫోకస్ చేసిందని త్వరలోనే అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌ మీద కూడా యాక్షన్‌ ఉండబోతున్నట్లు చెబుతున్నారు. సునీల్‌ను అరెస్ట్ చేసి విచారిస్తే..వైసీపీ నేతల కథేంటో మొత్తం బయట పడుతుందని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. అదే జరిగితే అప్పటి సీఎం, ఆయన చుట్టూ ఉన్న కోటరీలో ఓపెద్ద నేతకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.

వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక బాధ్యతలు.!
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును ఓ కేసులో అరెస్ట్ చేసి సీఐడీ అధికారులు టార్చర్ పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తనను కొట్టారంటూ రఘురామకృష్ణరాజు ఏపీలోని ఓ హాస్పిటల్‌కు వెళ్తే ఎలాంటి గాయాలు అయినట్లు ఆనవాళ్లు లేవని రిపోర్ట్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్‌ ట్రీట్ మెంట్ చేయించుకుని తన శరీరంపై చిత్రహింసలు పెట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి కోర్టులో కేసు వేశారు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆ కేసులో రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌పాల్‌ అరెస్ట్ అయ్యారు. విజయ్‌పాల్‌ వైసీపీ హయాంలో సీఐడీలో ఓఎస్డీ పోస్టులో ఉండేవారు. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన రెచ్చిపోయారన్న ఆరోపణలున్నాయి.

సీఐడీ చీఫ్‌గా కళ్లు, చెవులు సహా అన్నీ తానై ఉంటూ హల్‌చల్‌..
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా విజయ్‌పాల్‌కే అప్పగించేవారట. దీంతో వారి మెప్పు కోసం ఆయన ఇంకా పేట్రేగిపోయారంటున్నారు. చివరికి అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బరు బెల్ట్‌లతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేంత తీవ్రస్థాయికి చేరిందన్న ఫిర్యాదులున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్‌కుమార్‌కు కళ్లు, చెవులు సహా అన్నీ తానై ఉంటూ అక్కడ ఓ సూపర్‌పవర్‌లా విజయ్‌పాల్‌ వ్యవహరించారన్న విమర్శలున్నాయి.

ఇప్పుడు విజయ్‌పాల్‌.. నెక్స్ట్‌ సునీల్‌.. ఆ తర్వాత ఎవరు?
ఇలా ఇప్పుడు విజయ్‌పాల్‌..నెక్స్ట్‌ సునీల్‌ ఆ తర్వాత ఎవరు వంతు వస్తుందోనన్న టెన్షన్ కొనసాగుతోంది. ఈ కేసులోనే కాదు.. మైనింగ్‌, లిక్కర్‌, స్యాండ్‌, ల్యాండ్ కేసులు కూడా వైసీపీ నేతలను భయపెడుతున్నాయట. అప్పుడు కీలకంగా పనిచేసిన అధికారులు కూడా ఎప్పుడు తమవంతు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారట. ఇలా గత సర్కార్‌ హయాంలో జరిగిన అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాల చిట్టాపై సీరియస్‌గా ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం.

 

Also Read : బూడిద కోసం సై అంటే సై అంటున్న టీడీపీ నేత, బీజేపీ ఎమ్మెల్యే..! వివాదం ఏంటి?