Pawan Kalyan Representative Image (Image Credit To Original Source)
Pawan Kalyan: అతడే ఒక సైన్యం. కార్యకర్త ఆయనే.. ఆ పార్టీ లీడర్ అయినా..అధినేత అయినా ఆయనే. అలా తానే ఓడినా తలొగ్గకుండా ఒక ఆయుధమై నిలబడి గెలిచారు పవన్ కల్యాణ్. అయితే మొన్నటి విజయం వేరు. ఫ్యూచర్‌లో పరిస్థితులు అలానే ఉండకపోవచ్చు. పార్టీకి క్యాడర్, లీడర్లు..సంస్థాగత నిర్మాణం ఉంటేనే స్ట్రాంగ్‌గా నిలబడే అవకాశం ఉంటుంది. అందుకే యువతను పార్టీ వైపు ఆకర్షించే పనిలో పడిందట జనసేన. జెన్ జీ సెంట్రిక్‌గా పాలిటిక్స్ నడపడంతో పాటు..నవ యువకులతో బలమైన పునాదులు వేసుకునేలా పావులు కదుపుతున్నారట జనసేన అధినేత.
ఒక్క సీటుతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. చట్టసభల్లోకి అడుగు పెట్టింది జనసేన. ఏకంగా 21 సీట్లతో కింగ్ మేకర్‌గా కూటమిలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం, పాలనపైనే ఫోకస్ పెట్టిన జనసేనాని..ఇప్పుడు పార్టీ పటిష్టత కోసం సీరియస్ కాన్సన్‌ట్రేషన్ చేశారు. గ్రౌండ్ లెవల్‌లో క్యాడర్ బలోపేతం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికంటే మరింత బలపడి టీడీపీ, వైసీపీతో సమానంగా స్ట్రాంగ్ ఫోర్స్‌గా నిలబడాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతకాలం పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయని పవన్..ఫ్యూచర్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా జనసేనను పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారట. పవర్‌లో ఉన్నాం కాబట్టి.. పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారట.
పవన్ కోసం పనిచేస్తున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీకి అంతో ఇంతో క్యాడర్ ఉంది. కానీ సంస్థాగతంగా జనసేనకు బలమైన పునాదులు లేవు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు స్ట్రాంగ్‌గా లేని పరిస్థితి. పైగా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై.. వైసీపీ, టీడీపీ వెంట నడుస్తున్నట్లుగా జనసేనకు బ్యాక్ బోన్‌గా నిలుస్తున్న ఫిక్స్‌డ్ ఓటర్లు కూడా లేరు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారిలో మెజార్టీ ప్రజలు పార్టీల వారీగా విడిపోయిన పరిస్థితి. ఏ పార్టీకి సంబంధం లేని వారు పరిస్థితులను బట్టి..ఓసారి వైసీపీకి, మరోసారి టీడీపీకి మద్దతు తెలుపుతుంటారు. అయితే జనసేనకు కూడా వైసీపీ, టీడీపీ లాగా ఒక బలమైన వర్గాన్ని వెన్నుముకగా మార్చుకోవాలన్నది పవన్ ఆలోచన అంటున్నారు. జెన్ జీ సెంట్రిక్‌గా పాలిటిక్స్ చేస్తూ.. 20, 25 ఏళ్లలోపు వారిని జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యేలా చేయాలనేది పవన్ వ్యూహమంటున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్ జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకు నొక్కి చెప్తున్నారట పవన్. కూటమితో సమన్వయం, యువత ఆకాంక్షలు, ప్రజలతో సన్నిహిత సంబంధాలతో జనసేన మరోసారి ప్రభంజనం సృష్టించేలా పవన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారట. ప్రత్యేకంగా జెన్ జీ తరం సరికొత్తగా ఆలోచిస్తోందని..వారిని పార్టీకి దగ్గర చేయాలనేది సేనాని ఆలోచనగా చెబుతున్నారు.
జెన్ జీ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా ఉంది. పలు దేశాల్లో ప్రభుత్వాల తీరు నిరసిస్తూ తిరుగుబావుటా ఎగరవేస్తూ జెన్ జీ సత్తా చాటుతోంది. యువ కెరటాలై కన్నెర్ర చేస్తూ ప్రభుత్వాలకు వణకు పుట్టిస్తున్నారు. ఈ మధ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు జెన్ జీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. దేశంలోని జెన్ జీ నిర్మాణాత్మకమైనదని ఇటీవలే ప్రధాని మోదీ కూడా కామెంట్స్ చేశారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్‌ను జెన్ జీగా పిలుస్తారు. సోషల్ మీడియా వేదికల ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా చెబుతారు. అలాంటి జెన్ జీలను తమ వైపునకు తిప్పుకోవాలనేది జనసేన ప్రత్యేక కార్యాచరణగా ఉంది.
ఏపీ రాజకీయాల్లో..అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏపీలో థర్డ్ ఫోర్స్‌గా జనసేన దూసుకుని రావడానికి ఇదే సరైన సమయమని..అందుకు యువతను ఆయుధంగా మల్చుకోవాలనేది పవన్ ప్లాన్‌గా చెబుతున్నారు. టీడీపీకి ఎప్పటి నుంచో బలమైన క్యాడర్ గ్రౌండ్ లెవల్ వరకు ఉంది. విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా చెప్పుకోదగ్గ బలమే ఉంది. అయితే ఫ్యాన్ పార్టీ క్యాడర్, లీడర్లలో ఉన్న స్తబ్దతను తమ పార్టీ ఎదుగుదలకు అనువుగా మార్చుకోవాలని జనసేన చూస్తోందట. 2029 ఎన్నికల నాటికి ఏపీలో మూడో అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్‌గా నిలబడాలనే ప్లాన్‌తో జెన్ జీకి ఆకర్షించేలా పావులు కదుపుతున్నారట. అంతకంటే ముందే లోకల్ బాడీ ఎన్నికల్లో తన సత్తాను చాటితే..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట.
స్థానిక సంస్థల్లో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చి రోల్ మోడల్‌గా నిలవాలన్నది జనసేన ప్లాన్ అంటున్నారు. 20, 25 ఏళ్లలోపు యువకులను తమ పార్టీ సిద్ధాంతాల వైపు ఆకర్షిస్తే..తమకు సాలిడ్ ఓట్ బ్యాంకు ఉండటమే కాదు..పార్టీకి బలమైన పునాదులు పడుతాయని భావిస్తున్నారట. భవిష్యత్ అంతా యువతే కాబట్టి..పైగా జెన్ జీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేలా..జెన్ జీల సెంట్రిక్‌గా ఫ్యూచర్ ప్లాన్లు తయారు చేస్తున్నారట.
ఓవైపు వైసీపీ వీక్ అయిన చోట తాము ఆల్టర్నేట్‌గా బలపడాలనే స్కెచ్‌తో పాటు..మిగతా పార్టీలతో సమానంగా తమకు డెడికేటెడ్ ఓటు బ్యాంకును తయారు చేసుకునే స్కెచ్ వేస్తున్నారట. జనసేన ప్రజల కోసం పనిచేస్తుందని..ఆ పార్టీలోకి వెళ్తేనే రాజకీయ అవకాశాలు దక్కుతాయని యువతకు నమ్మకం కలిగించేలా సరికొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. జెన్ జీస్‌ను అట్రాక్ట్ చేసేలా పవన్ వేస్తున్న వ్యూహాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read: బీసీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్..! ఏంటీ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా?