Kadapa Ysrcp: జగన్ సొంత ఇలాకా. ఒకప్పుడు వైసీపీదే హవా. గత ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. తొలి గడప కడపలో టీడీపీ సత్తా చాటుతూ వస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బై ఎలక్షన్‌లో కూడా వైసీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. ఇక ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ లీడర్లంతా గప్ చుప్ అయ్యారట. ఒకరిద్దరు నేతలు తప్ప..మిగతా లీడర్లు అంతా సైలెంట్‌గానే ఉండిపోతున్నారట. జగన్ కంచుకోటలో నేతల మౌనరాగమెందుకు? మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను గాలికి వదిలేస్తే క్యాడర్ పరిస్థితి ఏంటి?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. రాష్ట్రమంతా ఒకఎత్తు.. కడప మాత్రం జగన్‌కు చాలా స్పెషల్. ఎందుకంటే అది ఆయన రాజకీయ క్షేత్రం. తాతలు, తండ్రుల కాలం నుంచి ఆధిపత్యం చలాయించిన ప్రాంతం. అధికారం ఉన్నా లేకున్నా జగన్ ఫ్యామిలీ, ఆయన అనుచరవర్గం గుప్పెట్లోనే ఉండేది కడప జిల్లా. కానీ గత ఎన్నికల్లో పవర్ పోయినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. 2024లో ఓటమి తర్వాత..ఒకరిద్దరు మినహా కడప జిల్లాలోని మిగతా వైసీపీ లీడర్లంతా సైలెంట్‌గా ఉండిపోతున్నారట.
అపొజిషన్ పార్టీ నేతలు కావాలనే సైలెంట్‌గా ఉంటున్నారా? లేక ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉండొద్దనే మౌనంగా ఉండిపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉండేవి. 2014 ఎన్నికల్లో ఒక్క రాజంపేట మినహా అన్నింటా వైసిపి గెలిచింది. ఇక 2019 లో జిల్లా అంతా ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్. 2024లో ఉమ్మడి కడప జిల్లాలో మూడు సీట్లు మాత్రమే గెలిచింది వైసీపీ.
సొంత జిల్లాలో ఓటమి కంటే నేతలు తన వెంట నిలబడకపోవడం జగన్‌కు నచ్చడం లేదట. పవర్‌లో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి అధికారం కోల్పోగానే జిల్లా నేతలు పార్టీని గాలికొదిలేశారని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. నడిపించే నేతల కోసం నియోజకవర్గాల్లోని క్యాడర్ ఆశతో ఎదురుచూస్తున్నారట. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. అయినా వైసీపీ అలర్ట్ అవ్వట్లేదన్న ఆరోపణలు సొంత పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి.
ఈ మధ్యే కడప జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డ జగన్ మేనమామ రవీంద్రరెడ్డి, వెంపల్లి సతీష్ రెడ్డి మీడియాలో హడావుడికే సరిపోతున్నారట. ఇక కాంట్రవర్సీ కామెంట్స్‌తో అప్పుడప్పుడు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లైమ్‌లైట్‌లో ఉండే ప్లాన్ చేస్తున్నారట. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్ ఎవరో తెగకపోవడంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తాను జగన్ దగ్గర ఎక్కువ కనిపిస్తూ సొంత పనులతో బిజీగా మారారని అంటున్నారు.
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వయోభారంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి కబ్జా ఆరోపణలు ఫేస్ చేస్తూ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా యాక్టీవ్‌గా పని చేయాలనుకంటున్నా లోకల్ పాలిటిక్స్ ఆమెకు హెడెక్‌గా మారాయట. ఇక రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ జగన్‌కు మంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరు నేతలు ఔట్ ఆఫ్ స్టేషన్ అన్నట్లుగానే ఉంటున్నారట. ఇక పులివెందుల వ్యవహారాలు ఎంపీ అవినాశ్, జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి.
ఒక్కో నేత తీరు ఒక్కో రకంగా ఉండటంతో జిల్లా క్యాడర్ అయోమయంలో పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్‌లో నేతలు మౌనంగా అధినేతకు భారంగా మారిందట. ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో మరోమారు ఫ్యాన్ పార్టీ పేలవమైనా ప్రదర్శన ఖాయమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. జిల్లాలో పార్టీని కాపాడాలని నేరుగా జగన్‌ను కలుస్తున్నారట లోకల్ లీడర్లు. కాస్త టైమ్ ప్లీజ్ అని జగన్ కార్యకర్తలను ఓదార్చే పని పెట్టుకున్నట్టు టాక్. లోకల్ దంగల్ స్టార్ట్ అయ్యేలోగా ఫ్యాన్‌కు రిపేర్ చేస్తారా లేదా చూడాలి.
Also Read: స్థానిక ఎన్నికల వేళ.. రేవంత్ సర్కార్‌కు కొత్త టెన్షన్..! కాంగ్రెస్ ఎలా గట్టెక్కబోతోంది?