Gossip Garage : ఆ ముగ్గురు కూటమి భాగస్వాములు. మూడు పార్టీల ముఖ్యనేతలు. మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. ఆరు నెలల కింద ఎన్నికలప్పుడు విజయవాడలో రోడ్ షో చేసిన ఆ నేతలు..ఇప్పుడు మళ్లీ సాగర తీరంలో సింగిల్ ఫ్రేమ్‌లో ఆకట్టుకోబోతున్నారు. ఆ అద్భుత సన్నివేశం కోసం మూడు పార్టీల నేతల క్యాడర్ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు.? ఎక్కడికి రాబోతున్నారు.? వాళ్లు చేయబోయే రోడ్‌షోకు అంతా స్పెషాలిటీ ఏంటి.?
మరోసారి ఒకే డయాస్ మీద అట్రాక్ట్ చేయబోతున్నారు..
మరోసారి ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వాళ్ల అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపబోతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సమ్‌థింగ్ స్పెషలే. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్, మోదీ డిస్కషన్.. వీడియోస్, ఫొటోస్ ఎంతగా వైరల్‌గా మారాయో తెలియంది కాదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కలిసి రోడ్ షో చేసిన ఈ ముగ్గురు నేతలు..ఇప్పుడు మరోసారి ఒకే డయాస్ మీద అట్రాక్ట్ చేయబోతున్నారు.
ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన కోసం వస్తున్న ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలసి రోడ్‌షో చేయబోతున్నారు. అయితే ఏపీ ఎలక్షన్స్‌కు ముందు ఈ ముగ్గురు లీడర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో పబ్లిక్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది.
విజయోత్సవ ర్యాలీలాగా జరిపేలా సన్నాహాలు..
కూటమి ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ఏపీకి వచ్చిన ప్రధాని..ఆ తర్వాత ఈ ఏడాదిలో మొదటిసారి విశాఖకు రానున్నారు. భారీ విజయం దక్కించుకున్న కూటమి నేతలు చేయబోయే ర్యాలీపై ఇప్పుడు క్యాడర్‌లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే జనవరి 8న నిర్వహించే మోదీ, బాబు, పవన్ రోడ్‌షోకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలాగా జరిపేలా సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : సైకిల్ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారీ చేయబోతుందా? తెలంగాణ గట్టు మీద చంద్రబాబు స్కెచ్ ఏంటి?
ప్రధాని 8న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. NTPC ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా..
ఆర్నెళ్ల పాలనలో సాధించిన విజయాలపై వివరించేందుకు రెడీ అవుతున్నారు కూటమి నేతలు. సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆశీల్‌మెట్టలో గల సంపత్ వినాయక్ ఆలయం నుంచి సభా ప్రాంగణం వరకూ ఓపెన్‌టాప్ వాహనంలో ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్‌షోలో పాల్గొంటారు.
ప్రధాని టూర్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ సర్కార్. ముగ్గురు మంత్రులతో పర్యవేక్షణ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జన సమీకరణ బాధ్యతను స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలకు అప్పగించారు. అయితే రోడ్ షోలో ముగ్గురు నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో..కూటమి పార్టీల క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది. అటు బీజేపీ క్యాడర్, లీడర్లు కూడా మోదీ టూర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అటు పవన్ ఫ్యాన్స్ కూడా తమ నేత రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కూటమి రథసారధిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్‌పై వైజాగ్ ప్రజల్లోకి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అటు ప్రధాని మోదీ వరాలు ప్రకటిస్తారని.. స్టీల్ ప్లాంట్‌పై ఏదైనా ప్రకటన చేస్తారని భావిస్తున్నారు ప్రజలు. చూడాలి మరి మోదీ టూర్‌ను కూటమి నేతలు రేంజ్‌లో సక్సెస్ చేయబోతున్నారో.
Also Read : చంద్రబాబు, జగన్, కేసీఆర్ బాటలో పవన్ కల్యాణ్.. ఏం చేస్తున్నారో తెలుసా..?