Challa Babu Representative Image (Image Credit To Original Source)
Challa Babu: స్టేట్ మొత్తం కూటమిదే హవా. ఆ నియోజకవర్గంలో మాత్రం ఆ వైసీపీ సీనియర్ లీడర్‌దే జోరు. అలాంటి బలమైన నేతతో ఢీ అంటే ఢీ అంటున్న..ఆ టీడీపీ లీడర్.. ఇంటా, బయట అందరికీ టార్గెట్ అయిపోయారట. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నారట. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో..ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా సేమ్ సీన్‌ను ఫేస్ చేస్తున్నారట ఆ నేత. ఇంతకు ఎవరా లీడర్? ఆయనకు వచ్చిన కష్టమేంటి?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గ పాలిటిక్స్ సమ్‌థింగ్ స్పెషల్. వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీదే అక్కడ హవా. 2009 నుంచి పుంగనూరులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పెద్దిరెడ్డి దూకుడుకు బ్రేకులు వేసేందుకు టీడీపీ అనేక ఎత్తులు వేసింది. 2024 ఎన్నికల్లో స్పెషల్‌గా టార్గెట్ చేసినా, ఆయన విజయాన్ని మాత్రం టీడీపీ ఆపలేకపోయిందన్న చర్చ ఉంది. గత ఎలక్షన్స్‌లో పెద్దిరెడ్డి చేతిలో టీడీపీ నేత చల్లా బాబు ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఓడినా..రాష్ట్రంలో అధికారం రావడంతో ఇక తిరుగుండదని భావించారట చల్లా బాబు.
ఎన్నో సవాళ్లను ఫేస్ చేస్తూ దాడులు, కేసుల పాలయ్యాయని వాపోతున్నారట. 2023లో టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనలో జరిగిన విధ్వంసంలో నమోదైన నాలుగు కేసుల్లో నిందితుడిగా చల్లా బాబు కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితిని కూడా ఆయన ఎదుర్కొన్నారట. 2024 ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పెద్దిరెడ్డిని ఓడించలేక పోయినా..ఆయన మెజారిటీని భారీగా తగ్గించారు చల్లా బాబు. ఇలా ప్రతిపక్షంలో ప్రత్యర్థి పార్టీకి టార్గెట్‌గా మారిన చల్లాబాబుకు ఇప్పుడు అధికారం వచ్చాక ప్రయారిటీ దక్కట్లేదట. పవర్‌లోకి వచ్చిన తొలినాళ్లలో కాస్త దూకుడు ప్రదర్శించి హంగామా చేసినా ఇప్పుడు స్పీడు తగ్గించాల్సి వస్తోందట. ఇందుకు ప్రధాన కారణం సొంత పార్టీలోనే కొందరు ఆయన హడావుడికి అడ్డంకులు సృష్టిస్తున్నారట.
అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువ..
పుంగనూరు టీడీపీ ఇంచార్జ్‌గా భారీ కాన్వాయ్‌తో..చల్లా బాబు చేస్తున్న హడావుడిని కొందరు సొంత పార్టీ నేతలే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట. టీడీపీలోనే ఒక వర్గం ఆయన్ను టార్గెట్ చేసి..హైకమాండ్ దగ్గర ఆయన పరపతిని తగ్గించే ప్రయత్నం చేస్తోందట. ఇది చల్లా బాబుకు ఇబ్బందిగా మారిందంటున్నారు. ఆయన అనుచరుల హడావుడిపైనా అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చల్లా బాబు పవర్‌కు బ్రేకులు వేసినట్లైందట. దీంతో చల్లాబాబు కూడా దూకుడును తగ్గించారట. జిల్లా ఇంచార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ పుంగనూరులో మరింత బలపడాలనుకుంటున్న చల్లాబాబుకు సొంత పార్టీ నేతల పెడుతున్న ఇబ్బందులు హెడెక్‌గా మారాయట.
నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఆయన వర్గానికి ఇంపార్టెన్స్ దక్కకపోవడంతో చల్లాబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. టీడీపీ అధికారంలోకి వస్తే తమ నాయకుడికి ప్రాధాన్యత ఉంటుందని భావించిన చల్లా అనుచరులు, టీడీపీ క్యాడర్ కూడా నిరాశ చెందుతుందట. పుంగునూరులో చల్లా బాబును వ్యతిరేకిస్తున్న ఒక వర్గం..హైకమాండ్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తుందట. పుంగనూరులో చల్లాబాబు దూకుడుతో పార్టీ బలపడిందన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉన్నా..ఆయనకు దక్కని ప్రాధాన్యత గురించే ఇప్పుడు ఎక్కవుగా చర్చ జరుగుతోందట. దీంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి, అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలోని ఒక వర్గానికి టార్గెట్‌గా మారి చల్లా బాబు పొలిటికల్ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారట.
Also Read: గంటాకు గుడ్‌టైమ్ స్టార్ట్ అయినట్లేనా? త్వరలో పెద్ద పోస్ట్ దక్కబోతోందా? ఏంటా పదవి..