Chandrababu Representative Image (Image Credit To Original Source)
AP Rajya Sabha Race: మూడు పార్టీలు. నాలుగు సీట్లు. ఎవరికెన్ని. ఇదే ఇప్పుడు ఏపీ కూటమి పార్టీల్లో చర్చ. ఎందరో ఆశావహులు…మరెందరో లాబీయింగ్‌లు. ఎవరి లెక్కలు వాళ్లవి. ఒక్కొక్కరి ఎక్స్‌పెక్టేషన్స్ ఒక్కోలా ఉన్నాయ్. పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న వాళ్లు.. ఆరాటపడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవల్ లాబీయింగ్ చేస్తున్నారట లీడర్లు. రాజ్యసభ సీట్లపై బీజేపీ ప్లానింగ్ ఒకలా ఉంటే..జనసేన, టీడీపీ అంచనాలు ఇంకోలా ఉన్నాయట. ఆ మూడు పార్టీల్లో..నాలుగు సీట్లు ఎవరికి? పెద్దల సభకు వెళ్లేదెవరు?
కూటమిలో రాజ్యసభ సీటు రేసు చర్చకు దారితీస్తోంది. మరో నాలుగు నెలల్లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఆ నాలుగు సీట్ల కోసం అటు టీడీపీ, ఇటు జనసేన, మరోవైపు బీజేపీలో ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్లకు ఉన్నాయ్. టీడీపీలో అయితే పైరవీల పర్వం నెక్స్ట్ లెవల్‌లో నడుస్తోందట. ఈ ఏడాది మే-జూన్ మధ్య జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికలపై అప్పుడే లాబీయింగ్ జోరుందుకుందట. ఖాళీ అయ్యే నాలుగు సీట్లను టీడీపీ, కూటమి పార్టీలే గెలుచుకునే అవకాశం ఉంది.
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని పదవీ కాలం 2026 జూన్ 21తో పూర్తి కానుంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ పదవీకాలం కూడా జూన్‌లోనే ముగుస్తుంది. వీళ్ల స్థానంలో నలుగురు నేతలు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.
అయితే మూడు పార్టీలు..నాలుగు సీట్లను ఎలా పంచుకుంటాయనేదే ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తొలుత మూడు స్థానాలకు, ఆ తర్వాత ఒక స్థానానికి ఎన్నిక జరిగితే టీడీపీ, బీజేపీ చెరో రెండు సీట్లు తీసుకున్నాయి. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటివరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు ఓ సీటు కేటాయిస్తారని అంటున్నారు. జనసేనకు కేటాయించే రాజ్యసభ సీటులో లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పరిశీలనలో ఉందని..తన అన్నయ్యను పెద్దలకు సభకు పంపితే ఎలా ఉంటుందనేదానిపై పార్టీ ముఖ్యనేతలతో పవన్ చర్చలు జరుపుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్.
నాలుగింట్లో ఒకటి జనసేనకు పోతే మిగిలేది మూడు సీట్లు. త్వరలో రిటైర్ అయ్యే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన రిలయన్స్ సంస్థలకు చెందిన పరిమళ్ నత్వానీని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. సేమ్‌టైమ్ బీజేపీ ఇంకో సీటును కూడా కోరే అవకాశం ఉందన్న గుసగుసలు మొదలయ్యాయి. అదే గనుక జరిగితే..బీజేపీకి రెండు సీట్లు ఇస్తే టీడీపీకి దక్కేది ఒక్కటే సీటు. ఆ సీటులో కూడా గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ తరఫున ఎన్నికైన సానా సతీష్‌కే మళ్లీ రెన్యూవల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీకి కొత్తగా ఒక్క రాజ్యసభ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.
రాజ్యసభ టికెట్ రేసులో సీట్లు త్యాగం చేసిన సీనియర్లు..!
టీడీపీలో చాలా మంది సీనియర్లు, గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన లీడర్లు రాజ్యసభ రేసులో వెయిటింగ్‌లో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన గల్లా జయదేవ్, పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్‌తో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీ జనార్ధన్, కనకమేడల రవీంద్రకుమార్, రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి..రాజ్యసభ బెర్తును ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న నేతలంతా టీడీపీకి, చంద్రబాబుకు సన్నిహితులు. పార్టీకి ఏదో విధంగా ఉపయోగపడిన వారే. కమ్మ, ఎస్సీ, బీసీ, రెడ్డి వర్గాల నుంచి ఆరేడుమంది రాజ్యసభ సీటు ఆశిస్తుండగా..తమకు దక్కే సీట్లపైనే టీడీపీ అధిష్టానం డైలమాలో ఉందట. ఎలాగైనా రెండు సీట్లు తీసుకుని ఒకటి సానా సతీష్‌కు రెన్యూవల్ చేయడంతో పాటు మరొక సీటు ఆశావహుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చి మిగతా వారిని మండలి రేసులో పెట్టే ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు.
Also Read: మళ్లీ అదే రచ్చ.. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీ రాజధానిపై ఈ చర్చ ఆగేదెప్పుడు?