Gossip Garage : పట్టుబట్టి గెలిచాం. రాజకీయ ప్రత్యర్థి ఇలాఖలో పాగా వేశాం. ఇక సీమ మనకు కంచుకోటగా మారాల్సిందే. జగన్‌కు అంతో ఇంతో బలమున్న రాయలసీమలో వైసీపీని తిరిగి పుంజుకోనివ్వద్దంటూ స్కెచ్ వేస్తోంది కూటమి. అందుకే జగన్ టార్గెట్‌గానే పవన్ దూకుడు పెంచుతున్నారు. వైసీపీ అధినేత కోటరీని వెంటాడుతున్నారు సేనాని. అభివృద్ధి పేరుతో చంద్రబాబు సీమవాసుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ కూటమికి అడ్డాగా మారబోతుందా.? ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీని కోలుకోకుండా చేయడంలో బాబు, పవన్ సక్సెస్ అవుతారా.?
రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్..
మొన్నటి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాం. అందరి అంచనాలను తలకిందులు చేసి రాయలసీమలో సత్తా చాటాం. ఇక సీమను వదలొద్దంటూ ఫిక్స్ అయిపోయిందట కూటమి. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్..రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. అందుకు ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు రాజకీయాలపై పైచేయి సాధించే ఎత్తులు వేస్తున్నారట.
జగన్ బలం రాయలసీమలోనే..
ఇప్పటికీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బలం ఎక్కడుందంటే..రాజకీయ అవగాహన ఉన్న వాళ్లు టక్కున చెప్పేది రాయలసీమ అనే. రాయలసీమ నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు. అందులో సగానికంటే ఎక్కువ సీట్లు రాయలసీమ రీజియన్‌లోనే ఉన్నాయి.
Also Read : ఏపీ నామినేటేడ్ పోస్టుల మూడో జాబితా సిద్ధం..! ఈసారి వారికి పదవులు ఖాయం?
వైసీపీని రాయలసీమలో కోలుకోలేని దెబ్బ కొట్టాలని ప్లాన్..
2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీని దాదాపుగా జీరో చేసి పారేసింది కూటమి. కానీ ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటే రాయలసీమలో స్వీప్ చేయడం కష్టం కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాయలసీమలో తిరిగి పట్టు సాధించి నెల్లూరు, ఒంగోలులో చెప్పుకోదగ్గ సీట్లు తెచ్చుకున్నా..కోస్తా జిల్లాల్లో ఏ మాత్రం అనుకూలత పెరిగినా మరోసారి జగన్ సీఎం అవడం పక్కా అన్నది పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. అందుకే వైసీపీని రాయలసీమలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్.
Chandrababu-Jagan
టీడీపీ అధినేత చంద్రబాబు అయితే చాణక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారట. 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడినా ఒంటరిగా పోటీ చేసి నలభై శాతానికి తక్కువ కాకుండా ఓట్ షేర్ దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే సీఎం చంద్రబాబు ఇప్పటినుంచే 2029 ఎన్నికల కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. జనసేన, బీజేపీతో కలసి రాబోయే ఎలక్షన్స్‌ను ఫేస్ చేయాలని ఫిక్స్ అయిన చంద్రబాబు అందుకు తగ్గట్లుగా సర్వం సిద్ధం చేసుకుంటున్నారట.
పవన్ ద్వారా రాయలసీమ యూత్‌ను ఆకట్టుకునేలా వ్యూహం..
సీమలో జనసేన ప్రభావం ఉందని నమ్ముతున్నారట చంద్రబాబు. పవన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కు టీడీపీ, బీజేపీ ఓట్లు యాడ్ అయితే మళ్లీ ప్రభంజనమే అని లెక్కలు వేసుకుంటున్నారట. రాయలసీమ యూత్‌ను ఆకట్టుకునేలా పవన్‌ను అస్త్రంగా వాడాలని డిసైడ్ అయ్యారట బాబు. అలాగే బలమైన సామాజిక వర్గం కూడా గ్లాస్ పార్టీకి అండగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన థియరీని అమలు చేయాలని ఎత్తులు వేస్తున్నారట.
పక్కా వ్యూహంలో భాగంగానే తరచూ రాయలసీమ పర్యటనలు..
పక్కా వ్యూహంలో భాగంగానే తరచూ రాయలసీమ పర్యటనలు చేస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్. ఈ మధ్యే కడప వెళ్ళి మరీ ఎంపీడీవో మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు. ఏకంగా రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించేశారు. రాయలసీమ మీ జాగీరు కాదు.. గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. లేటెస్ట్‌గా కర్నూలు జిల్లాలో వెళ్లి డే లాంగ్ ప్రోగ్రాం పెట్టుకుని గ్రీన్ కో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. త్వరలో కడపలో పర్యటించి.. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్న అటవీ భూములను పరిశీలిస్తారట.
Pawan and chandrababu
సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా చేస్తామంటున్నారు. వాటర్ రిసోర్స్ మీద ఫోకస్ పెట్టి..కరువు ప్రాంతంగా పేరున్న సీమలో పచ్చని పంటలు పండేలా చేయాలని భావిస్తున్నారట. గతేడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని..ఏపీ ప్రజలు అందులో 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని అంటున్నారు చంద్రబాబు. సముద్రంలో కలిసే నీళ్లు వ్యవసాయానికి ఇతర అవసరాలకు వాడుకుంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.
వైసీపీని దెబ్బకొట్టాలంటే అక్కడ పవన్ దూకుడు అవసరం..!
ఇదంతా ఎందుకు అంటే వైసీపీని రాజకీయంగా నిలువరించడానికేనన్న చర్చ జరుగుతోంది. రాయలసీమలో టీడీపీ బలానికి తోడు జనసేన కూడా తోడైతే మరోసారి సీమలో ఎదురు ఉండదని ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు వైసీపీని దెబ్బ తీయాలంటే అక్కడ పవన్ దూకుడు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట.
ఇక గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా గుంటూరు జిల్లాల్లో తమకు రాజకీయ ఆధిపత్యం ఉందని భావిస్తోంది కూటమి. అందుకే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్‌గా ఉన్న రాయలసీమలోనే పాగా వేస్తే.. వైసీపీ ప్రభావం మిగిలిన ప్రాంతాల మీద పడకుండా ఉంటుందని ముందస్తు వ్యూహాలను అమలు చేస్తున్నారట టీడీపీ అధినేత. చంద్రబాబు, పవన్ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయి.. రాయలసీమలో వైసీపీని తిరిగి పుంజుకోకుండా చేయడంలో కూటమి సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి మరి.
Also Read : మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోదీ ఎందుకు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్లు? బీజేపీ వ్యూహమేంటి?