Gossip Garage Ys Jagan Good Book (Photo Credit : Facebook)
Gossip Garage : మీకు అర్థం అవ్వట్లేదప్ప. మనం ఇప్పుడు పవర్‌లో లేమ్. అందుకే రూటు మార్చాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎట్ల చేసినా నడుస్తది. అపోజిషన్‌లోకి వచ్చాక రివర్స్ గేర్ వేయాలి. అందుకే స్ట్రాటజీ మార్చా.. ఇక సెంటిమెంట్‌తో ఆయింట్‌మెంట్ పూయడమే. మంచి చేస్తామని నమ్మించాలి.. మళ్లీ పవర్‌లోకి రావాలి. ఇదే రూట్‌ను ఫాలో అవుతున్నారట ఫ్యాన్ పార్టీ బాస్. వాళ్లు రెడ్‌బుక్ అంటే సార్ గుడ్‌బుక్‌ను తెరమీదకు తెస్తున్నారు. ఇక అంతా సాఫ్ట్ బిహేవియరే ఉంటుందట. క్లీన్‌గా ఉంటూ మళ్లీ క్వీన్‌స్వీప్ చేస్తారట. ఇదంతా సరేకానీ అప్పటి అరాచకం మాటేమిటి అంటోంది టీడీపీ. మాకు నమ్మకం లేదు దొర అంటున్నారట ఏపీ పబ్లిక్.
గుడ్‌బుక్‌లో రాసుకున్న వారందరికీ భవిష్యత్‌లో అవకాశాలు, ప్రమోషన్లు..!
పవర్ పోయింది. సార్ అపోజిషన్‌లో ఉన్నారు. స్ట్రాటజీ మార్చేశారు. అప్పుడు తగ్గేదేలే అన్నారు. ఇప్పుడు నెగ్గే స్కెచ్‌లో భాగంగా తగ్గుతున్నారు. సిచ్యువేషన్ బాలేనప్పుడు చిల్ అవడమే బెటర్ అన్నట్లుగా.. కాస్త రిలాక్స్ అవుతూనే కొత్త ప్లాన్‌ను ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము వెరీ సాఫ్ట్. నో అరాస్‌మెంట్. ఇప్పుడు అంతా గాంధీగిరి. ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తామన్నంత కలరింగ్ ఇస్తున్నారు. టీడీపీ రెడ్‌బుక్ తెస్తే తాము గుడ్‌బుక్‌ను తీసుకొస్తామంటున్నారు.
అంతేకాదు తానొద్దని చెబుతున్నా అన్యాయం చేసే వారి పేర్లను, అధికారుల జాబితాను తమ పార్టీ నేతలు రెడ్‌బుక్స్‌లో రాసుకుంటున్నారని చెబుతున్నారు వైఎస్ జగన్. తాను మాత్రం వైసీపీ కోసం కష్టపడే వారి పేర్లతో గుడ్‌బుక్ రాసుకుంటున్నానని అంటున్నారు. ఇక నో రివెంజ్ ఓన్లీ గుడ్డే అని చెప్పుకొస్తున్నారు. గుడ్‌బుక్‌లో రాసుకున్నవారందరికీ భవిష్యత్‌లో అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయట.
రివెంజ్ పాలిటిక్స్‌కే జగన్ ప్రయారిటీ ఇచ్చారన్న విమర్శలు..
రెడ్ బుక్ అంటే రివెంజ్ అన్నట్లుగా.. జగన్ మాటల్లో అర్థం అవుతోంది. గుడ్‌బుక్ అంటే మంచి చేసేందుకే అని చెప్పుకొస్తున్నారు. కానీ పవర్‌లో ఉన్నప్పుడు సొంత పార్టీ కార్యకర్తలను.. పార్టీ కోసం త్యాగం చేసిన లీడర్లు పట్టించుకోలేదన్న చర్చ ఉంది. అంతే కాకుండా రివెంజ్ పాలిటిక్స్ చేశారన్న ఆరోపణలు వైసీపీపై తీవ్రస్థాయిలో ఉన్నాయి.
ఒక రకంగా అరాచకాలు, అణిచివేతల వల్లే వైసీపీ ఘోర పరాజయం పాలైందన్న ఒప్పుకోలేని నిజం అన్న టాక్ కూడా ఉంది. ల్యాండ్, స్యాండ్, మైనింగ్‌తో పాటు ప్రతీ రంగంలో ఇష్టారీతిన వ్యవహరించడంతో పాటు తమను ప్రశ్నించిన వారిపై దాడులు చేశారని టీడీపీ గుర్తు చేస్తోంది. అప్పట్లో టీడీపీ ఆఫీస్ మీద దాడి, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు మీద అటాక్.. చివరకు చంద్రబాబు అరెస్ట్ వరకు జగన్ రివెంజ్ పాలిటిక్స్‌కే ప్రయారిటీ ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి.
కూటమి సర్కార్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు…
రెడ్‌బుక్‌కు కౌంటర్‌గానే జగన్ గుడ్‌బుక్ తెచ్చారన్నది నిజం. అయితే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చెప్పిన రెడ్‌బుక్‌ను పెద్దగా పట్టించుకోలేదు జగన్. కానీ ఇప్పుడదే రెడ్‌బుక్‌ను కార్నర్ చేస్తూ గుడ్ బుక్ అని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి తరచూ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావటం.. కూటమి సర్కారు ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే వ్యాఖ్యల్ని చేయటం కనిపిస్తుంది. రెడ్‌బుక్ మీద ఇప్పటివరకు వైసీపీ అధినేత ఎన్నో వ్యాఖ్యలు చేసినా.. గుడ్‌బుక్ ప్రస్తావన మాత్రం కౌంటర్‌గా భావిస్తున్నారు వైసీపీ నేతలు.
నిరాశలో ఉన్న క్యాడర్, లీడర్లలో ఆశల్ని చిగురించే ప్రయత్నం..
అధికారాన్ని ఇచ్చేది పాలించేందుకే తప్ప.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు కానే కాదన్న విషయం జగన్‌కు ఇప్పటికే అర్థమైనట్లు ఉందంటున్నారు టీడీపీ లీడర్లు. అంతర్మథనమే జగన్ నోట గుడ్‌బుక్ మాటల్ని చెప్పించిందని చురకలు అంటిస్తున్నారు. తన గుడ్ బుక్‌లో మంచి చేసే అధికారుల పేర్లు రాస్తామని.. పార్టీ కోసం పని చేసే వారి పేర్లు నమోదు చేస్తామని చెప్పటం ద్వారా నిరాశలో ఉన్న క్యాడర్, లీడర్లలో ఆశల్ని చిగురించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేసి అపోజిషన్‌లోకి వచ్చేసరికి నీతులా?
అయితే జగన్ చెప్తున్న గుడ్‌బుక్‌ను వైసీపీ కార్యకర్తలు, ప్రజలే నమ్ముతారా లేదా అన్నది డౌట్‌గా అంటున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. తొమ్మిదేళ్లు కష్టపడి పార్టీని నిలబెడితే అధికారంలోకి వచ్చాక తమను మరిచారన్న భావన వైసీపీ క్యాడర్‌లో ఇప్పటికీ ఉంది. అలాంటి జగన్ ఇప్పుడు గుడ్‌బుక్ అని చెప్తున్నారంటే మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు టీడీపీ లీడర్లు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేసి అపోజిషన్‌లోకి వచ్చేసరికి నీతులు చెప్తున్నారన్న రివర్స్ అటాక్ చేస్తున్నారు. జగన్ గుడ్‌బుక్ ప్రస్తావన.. టీడీపీ విమర్శలు ఎలా ఉన్నా.. మాటలను చేతల్లో అమలు చేస్తారా లేదా అన్నది కూడా జనాలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత జగన్ మీదే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు.. విజయదశమి శుభాకాంక్షలు: నారా లోకేశ్