జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు.. విజయదశమి శుభాకాంక్షలు: నారా లోకేశ్
వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించిందని నారా లోకేశ్ చెప్పారు.

Nara Lokesh
ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు.
వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం సాకారం కానుంది. రైల్వేజోన్ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చేయూతనందిస్తోంది.
ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకుందాం. ప్రజా సంక్షేమం- రాష్ట్రప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను” అని లోకేశ్ చెప్పారు. కాగా, ప్రజలకు పలువురు రాజకీయ ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ,…
— Lokesh Nara (@naralokesh) October 12, 2024
రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ.. పోటెత్తిన భక్తులు