YSR Heir Row వారసత్వం. ఆస్తుల కోసమే కాదు..రాజకీయ వారసత్వంపై కూడా బిగ్ ఫైట్ నడుస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం వార్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఇప్పుడు వైఎస్‌ఆర్ వారసుడు ఎవరనే కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చిన జగన్..తండ్రి బతికి ఉన్నప్పుడే ఎంపీ అయ్యారు. తర్వాత బైపోల్‌లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు. పార్టీ పెట్టి..వైఎస్ లెగసీతోనే అధికారంలోకి వచ్చి వారసుడిగా ప్రూవ్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు షర్మిల తన కుమారుడ్ని లైమ్‌లైట్‌లోకి తెచ్చారు. మా అబ్బాయే వైఎస్‌ఆర్ వారసుడు అంటున్నారు. ఇంతకు ఈ వారసత్వం వార్ ఏంటి? వైసీపీ అబ్జక్షన్స్ ఏంటి.? షర్మిల వాదనేంటి.?
ఏ రిలేషన్ అయినా బాగున్నంత వరకు అంతా ఆల్ రైట్ అన్నట్లు కనిపిస్తుంటుంది. చిన్న తేడా కొట్టినా వై నాట్ అంటూ..వాయిస్ రేజ్ చేయడం..తగ్గేదేలే అంటూ ఢీకొట్టడం కామన్ అయిపోయింది. పాలిటిక్స్‌లో ఇది కొత్తేమి కాదు. తండ్రి మరణం తర్వాత జగన్ వెంట నడిచి..అన్నకు బాసటగా నిలిచిన షర్మిల..తర్వాత ఆయనతో గ్యాప్ పెరిగి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఏపీకి షిఫ్ట్ అయిపోయి అక్కడ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతూ..జగన్‌ను ఇరకాటంలో పెడుతూ వస్తున్నారు.
ఆ ఎపిసోడ్ అలా నడుస్తుండగానే..ఇప్పుడు తన కుమారుడిని తెరపైకి తెచ్చారామె. కర్నూలు ఉల్లి మార్కెట్‌ను సందర్శించిన షర్మిల..తన కుమారుడు రాజారెడ్డిని ఆ పర్యటనకు వెంటబెట్టుకుని వెళ్లారు. కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది.
ఉల్లి మార్కెట్ పరిశీలన తర్వాత మీడియాతో మాట్లాడిన షర్మిల తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. అంతే నెక్స్ట్ హవర్ నుంచే రచ్చ స్టార్ట్ అయింది. అంతే వైసీపీ నేతలు ఎవరూ నేరుగా రియాక్ట్ కాకపోయినా..వైసీపీ సోషల్ మీడియా మాత్రం పోస్టుల హోరెత్తించింది. రాజారెడ్డి వైఎస్ వారసుడెలా అవుతారు.? అందుకు అవకాశమే లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లతో రెచ్చిపోయారు.
వైసీపీ రియాక్షన్‌పై షర్మిల అదే రేంజ్‌లో ఇచ్చి పడేస్తున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని కుండబద్దలు కొట్టేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డే పెట్టారని గుర్తు చేస్తున్నారామె. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరిచి గీపెట్టినా దీనిని ఎవరూ మార్చలేరని చెబుతున్నారు. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టనే లేదు..అప్పుడే వైసీపీలో అంత గాబరా ఎందుకంటు సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఎక్కడైనా కుమారులే రాజకీయ వారసులుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ తెలుగు స్టేట్స్‌లో కాస్త డిఫరెంట్. అందులో జగన్, షర్మిల ఎపిసోడ్ ఇంకా వేరు. వైఎస్ బతికున్నప్పుడు షర్మిల పాలిటిక్స్‌లోకి రాలేదు. ఆ మాటకొస్తే జగన్ జైలుకు వెళ్లే వరకు కూడా షర్మిల యాక్టీవ్‌గా లేరు. అన్న అరెస్ట్ అయ్యాక పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి జగన్‌కు తోడునీడగా ఉన్నారు. అలా ఆమె వైఎస్ఆర్ కుమార్తెగా ప్రజాదరణ పొందారు.
తర్వాత అన్నతో విబేధాలు వచ్చి దూరయ్యారు. ఆ తర్వాత ఆమె పాలిటిక్స్ లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తన కుమారుడ్ని తెరమీదకు తేవడం కొత్త చర్చకు దారితీస్తోంది. కుమారుడి కొడుకు..అతని తండ్రికి..లేకపోతే తాత రాజకీయానికి వారసుడుగా పాలిటిక్స్‌లోకి రావడం కామన్. బట్ కూతురు కొడుకు వారసుడు ఎలా అవుతారన్నది లాజిక్ పాయింటే. కాకపోతే జగన్‌కు కుమారులు లేరు. ఇద్దరు కూతుర్లే. జగన్ ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడిగా ప్రూవ్డ్. ఇప్పుడు వైఎస్ వారసుడిగా షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ డిఫరెంట్ సినారియో. కొడుకుకు కుమారులే లేనప్పుడు..ఒకవేళ ఉన్నా వాళ్లు రాజకీయాల్లో లేకపోతే..కూతురు కుమారులు వారసులు ఎందుకు కావొద్దన్నది ఒక వాదన.
పైగా షర్మిల చెప్తున్న పాయింట్స్ కూడా లాజికల్‌గానే ఉన్నాయి. రాజారెడ్డి అనేది..రాజశేఖర్‌రెడ్డి తండ్రి..జగన్ తాత పేరు. కూతురు కొడుక్కి రాజశేఖర్‌రెడ్డి తన తండ్రి పేరు పెట్టారంటే..షర్మిల కుమారుడ్ని వైఎస్‌ఆర్ వారసుడిగా ఫీల్ అయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఈక్వేషన్స్, లాజిక్కులు ఎలా ఉన్నా వైఎస్ వారసుడు ఎవరన్నది ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్న అంశం. వైఎస్ రాజకీయ వారసుడు ఎవరన్న లొల్లి ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.