వీఆర్ఎస్‌పై సీనియర్ ఐఏఎస్ యూటర్న్..! మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం..!

Gossip Garage : ఏదో పొరపాటు అయిపోయింది.. ప్రాంక్ అనుకోవచ్చుగా.. తొందరపాటు చర్య అని లైట్ తీసుకోవచ్చుగా. అర్థం చేసుకోండి బాస్.. ప్రజర్ లో అలా చేసేశాను. వీర్ఎస్ కు అప్లయ్ చేశానా.. దరఖాస్తు పెట్టుకుంటే అంత తొందరగా ఆమోదిస్తారని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఇవన్నీ ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ సర్కార్ కు మొర పెట్టుకుంటున్న తీరు ఇది. గతంలో జరిగింది మర్చిపోండి అని ఆయన అంటుంటే.. నో ఎక్స్ కూజ్ అని ఏపీ సర్కార్ అంటోంది. ఇప్పుడెలా మరి, అంతా సర్దుకుపోతుందా, ఫైల్ రిటర్న్ తీసుకోవడం కష్టమేనా?

మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నపం
ప్రభుత్వం మారింది. ఆ అధికారి హోదా మారిపోయింది. మామూలుగా అయితే ప్రభుత్వాలు మారుతాయి. ఆఫీసర్లు పర్మినెంట్‌గా ఉంటారు. కానీ వైసీపీ సర్కార్ దిగిపోయింది. ఆ వెంటనే తాను అధికారిగా కొనసాగొద్దనుకున్నారా ఆఫీసర్. ఇంకేముంది వెంటనే VRSకు దరఖాస్తు పెట్టుకున్నారు ఐఏఎస్ అధికారి. ఏపీ సర్కార్ కూడా ఓకే చెప్పింది. సెప్టెంబర్ 30 తర్వాత ఆయనకు ఉద్వాసన కూడా తప్పదు. కానీ సార్ ఇప్పుడు గేర్ మార్చారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం అప్లై చేసుకున్న ఏపీ సీనియర్ IAS అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మనసు మార్చుకున్నారు. తాను మళ్లీ సర్వీసులోకి వస్తానంటున్నారు. తనను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. VRS విషయంలో తొందరపడ్డానని.. తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యుల్ని కలిసి విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. కూటమి సర్కార్ ఆయన విషయంలో పాజిటివ్ గా లేనట్లు తెలుస్తోంది.

కూటమి సర్కార్ రాగానే వీఆర్ఎస్ కు దరఖాస్తు..
ప్రవీణ్ ప్రకాశ్ వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. అలాగే ఆయన చుట్టూ కొన్ని వివాదాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనను GADకి సరెండర్ చేశారు. ఆ వెంటనే VRSకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ 3 నెలల ముందస్తు నోటీసు ఇస్తూ జూన్ 25న లేఖ సమర్పించారు. సెప్టెంబర్ 30తో నోటీసు గడువు ముగియనుంది.

అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు..
ఇంతలో ట్విస్ట్ ఇస్తూ.. వారం రోజుల వ్యవధిలోనే ఆయన VRSను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతేకాదు ప్రభుత్వం ఆ జీవో సెప్టెంబరు 30 తర్వాత అమల్లోకి వస్తుందని తెలిపింది. అప్పటివరకు ప్రవీణ్ ప్రకాశ్ ఏపీలోనే. ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వదు. ప్రవీణ్ కు అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుంది. సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా, జీఏడీ పొలిటికల్ విభాగం ముఖ్య కార్యదర్శిగా ఏకకాలంలో రెండు పోస్టులు నిర్వహించారు. ఆ తర్వాత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.

తన నిర్ణయంపై ప్రవీణ్ ప్రకాశ్ యూటర్న్ ..!
విశాఖలో విలాసవంతమైన భవనాలకు రుషికొండను ఎంపిక చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పాత్ర ఉందనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో..టీచర్ల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపు వంటి అంశాల్లో ఆయన నిర్ణయాలపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్న తర్వాత ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ హడావుడి చేశారు ప్రవీణ్. హిందీ పాటలకు హావభావాలు పలికిస్తూ రీల్స్ పోస్ట్ చేశారు. ఇప్పుడు తన నిర్ణయంపై యూటర్న్ కాదు ఏకంగా రివర్స్ గేర్ వేసేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోడంటూ ఏపీ సర్కార్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని టాక్.

 

Also Read : నిత్యం దాడులు, ఘర్షణలు.. ఉద్రిక్తతలకు కేరాఫ్‌గా మారిన తాడిపత్రి, ఈ పరిస్థితులు మారేది ఎప్పుడు?

ట్రెండింగ్ వార్తలు