Governor Abdul Nazeer
Governor speech Highlights in ap assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామని, మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశామని చెప్పారు. 2027 లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
గవర్నర్ ప్రసంగం హైలెట్స్..
గత ప్రభుత్వం పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది.
ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు.
ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం.
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశాం.
అన్న క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం.
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.
ప్రతి నెల ఒకటో తేదీనే ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం.
పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.
వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది.
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి.
డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది.
2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ ధ్యేయం.
అమృత్ జల్ జీవన్ మిషన్ ను కొనసాగిస్తున్నాం.
ప్రతి ఇంటికి కులాయి నీటిని అందిస్తున్నాం.
జలహారతి కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు.
వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం.
వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం వంటి విధానాలు అమలు చేస్తున్నాం.
మెగా పోర్టులు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాం.
సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం.
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం.
గవర్నర్ ప్రసంగం సమయంలోనే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీకి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోపాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు.. అనంతరం సభను వాకౌంట్ చేశారు.