Site icon 10TV Telugu

నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన కేసు.. విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.రఘువీర్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించాలని ఉత్తర్వులు

Nandyal Poll Code Violation Allu Arjun

విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.రఘువీర్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో నంద్యాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి సినీనటుడు అల్లు అర్జున్ రావడంతో ప్రజలు భారీగా గుమిగూడారు.

అంతమంది జనం ఒక చోట చేరుతుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు రఘువీర్‌ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనికోసం ఎంక్వయిరీ అథారిటీ, ప్రభుత్వం తరఫున ఈ కేసు విషయంలో హజరు అయ్యేందుకు అధికారిని నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రఘువీర్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో ప్రభుత్వం సంతృప్తి చెందలేదు.

Also Read: సాధువు వేషధారణలో వచ్చి భార్యను హతమార్చిన వ్యక్తి

తనపై అభియోగాలు డ్రాప్ చేయాలని చేసుకున్న విజ్జప్తిని తిరస్కరించింది. దీంతో రఘువీర్ రెడ్డిపై రెగ్యూలర్ ఎంక్వయిరీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు ఎంక్వైరీ అధికారిగా ఐజీపీ, ఇంటిలిజెన్స్ అధికారి రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, అనంతపురం డాక్టర్ శీముషిని ప్రభత్వం తరఫున ప్రజెంట్ అవ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెగ్యూలర్ విచారణను పూర్తిచేసి రిపోర్టును సబ్మిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు జీవో ఆర్టీ నంబర్ 1476ను జారీ చేశారు సీఎస్ కే విజయానంద్.

Exit mobile version