సాధువు వేషధారణలో వచ్చి భార్యను హతమార్చిన వ్యక్తి

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించింది. హత్యకు ఉపయోగించిన హామ్మర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాధువు వేషధారణలో వచ్చి భార్యను హతమార్చిన వ్యక్తి

Updated On : August 7, 2025 / 6:02 PM IST

ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను హతమార్చేందుకు ఓ వ్యక్తి సాధువు వేషధారణలో ఇంటికి వచ్చి ఆమెను హామ్మర్‌తో బాది హత్య చేశాడు. దక్షిణ ఢిల్లీ నేబ్ సారై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిరణ్ ఝా అనే మహిళ రక్తపు మడుగులో పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గల కారణాల గురించి ఇంకా తెలియరాలేదు.

“అదే ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాం. నిందితుడు ప్ర‌మోద్ ఝా అర్ధరాత్రి సమయంలో కిరణ్ ఇంటి వైపు వెళ్లినట్లు కనపడింది. హత్య అనంతరం తప్పించుకున్నట్టు అనిపిస్తోంది” అని అధికారులు చెప్పారు.

Also Read: దెబ్బ అదుర్సు కదూ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కుమ్మిపడేస్తున్న రజనీకాంత్ ‘కూలీ’.. ఏకంగా అన్ని కోట్లా? ‘వార్ 2’తో బిగ్ ఫైట్.. ఏం జరుగుతోంది?

ప్రాథమిక విచారణ ప్రకారం.. బిహార్‌కు చెందిన ప్ర‌మోద్ (55) గత 10 సంవత్సరాలుగా భార్యతో వేరుగా ఉంటున్నాడు. ఆగస్టు 1న ముంగేర్ జిల్లాలోని తన గ్రామం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చాడు.

కిరణ్ తన కుమారుడు దుర్గేశ్ ఝా, కోడలు కమల్ ఝా, మనవరాలితో కలిసి నివసించేది. దుర్గేశ్ బిహార్‌ ధర్బంగాలోని మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు, హత్య జరిగిన సమయంలో ఢిల్లీలో లేడు.

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించింది. హత్యకు ఉపయోగించిన హామ్మర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద గాలింపు జరుగపుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.