బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని చిన్న మట్లగొంది గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ సంతోష్‌ అదే గ్రామానికి చెందిన ఓ

  • Publish Date - June 3, 2020 / 09:56 AM IST

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని చిన్న మట్లగొంది గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ సంతోష్‌ అదే గ్రామానికి చెందిన ఓ

అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని చిన్న మట్లగొంది గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ సంతోష్‌ అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన కొత్తరూముల గ్రామ వాలంటీర్‌ సంతోష్‌ అదే కాలనీకి చెందిన ఓ బాలిక ఇంటికి వెళ్లాడు. మీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారని బాలికను అడిగాడు. మా అమ్మానాన్నలు పనికి వెళ్లారని బాలిక చెప్పింది. 

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై:
బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని తెలియడంతో వాలంటీర్‌ సంతోష్ ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక గట్టిగా అరిచింది. పాప కేకలు విన్న చట్టుపక్కల వారు పరుగున వచ్చారు. ఇది గమనించిన వాలంటీర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు శింగనమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వాలంటీర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పొక్సో యాక్ట్‌ మేరకు అత్యాచారయత్నం, లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి నివేదిక అందాక గ్రామ వాలంటీర్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న కొందరు వాలంటీర్లు:
ప్రభుత్వ ఫలాలను ప్రజల ఇంటికే చేర్చాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వాలంటీర్లను నియమించారు. ప్రతి ఇంటకి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను వాలంటీర్లు ప్రజలకు చేరవేస్తారు. కాగా కొందరు వాలంటీర్లు తమ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. విశాఖ జిల్లాలో వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

Read: అక్రమ మద్యం తెస్తూ పట్టుబడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు