group clashes in gannavaram ysrcp: గన్నవరం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రెండు నెలల క్రితం సచివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో తలెత్తిన వివాదం మరోసారి రాజుకుంది.
ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా దుట్టా వర్గీయులు ఆందోళనకు దిగారు. వంశీ అనుచరులకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బాపులపాడు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. వంశీ అనుచరుల ఆగడాలు పెరిగాయంటూ ప్లకార్డుల ప్రదర్శించారు దుట్టా అనుచరులు.