ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకం? వారికి రూ.15,000

ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంటోంది.

AP CM Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్‌ కార్యాలయంలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాపు మహిళలకు ఆర్థిక చేయూత కోసం “గృహిణి” పథకాన్ని తీసుకురావాలని కూటమి సర్కారు యోచిస్తోందని చెప్పారు.

Also Read: ఈ క్రికెటర్‌ చేసిన ఒక్కో పరుగుకు రూ.10 లక్షల చొప్పున చెల్లించిన లక్నో సూపర్ జెయింట్స్‌.. మొత్తం రూ.27 కోట్లు వృథా

దీని ద్వారా కాపు మహిళలకు వన్‌టైం కింద రూ.15,000 ఇవ్వాలని కాపు సంక్షేమ కార్పొరేషన్‌ ప్రతిపాదనలు చేసింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంటోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు కాపు సంక్షేమానికి రూ.4,600 కోట్లు కేటాయించిందని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. దాని వల్ల సాధించిన ఫలితాలను ఏడాదిలో చూపిస్తామని తెలిపారు.