ఈ క్రికెటర్‌ చేసిన ఒక్కో పరుగుకు రూ.10 లక్షల చొప్పున చెల్లించిన లక్నో సూపర్ జెయింట్స్‌.. మొత్తం రూ.27 కోట్లు వృథా

ఐపీఎల్‌ 2025లో ఆడిన ప్రతి మ్యాచ్‌కు (మొత్తం 14 మ్యాచులు ఆడాడు) అతడు రూ.1.93 కోట్లు సంపాదించినట్లు లెక్క.

ఈ క్రికెటర్‌ చేసిన ఒక్కో పరుగుకు రూ.10 లక్షల చొప్పున చెల్లించిన లక్నో సూపర్ జెయింట్స్‌.. మొత్తం రూ.27 కోట్లు వృథా

Pic: @LucknowIPL (X)

Updated On : May 29, 2025 / 1:08 PM IST

ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించకుండానే ఐపీఎల్‌ 2025 సీజన్‌ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. జట్టులోని ప్రతి ఆటగాడిపై లక్నో సూపర్ జెయింట్స్‌ భారీగా ఖర్చు చేసింది. కానీ, పలువురు ఆటగాళ్లు అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ చాలా నిరాశపర్చాడు.

ఐపీఎల్‌ వేలంలో రిషబ్ పంత్‌ను ఎల్‌ఎస్‌జీ రూ.27 కోట్లకు కొనుక్కుని, జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. లక్నో జట్టులోని విదేశీ ఆటగాళ్లు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ రాణించినప్పటికీ.. రిషబ్ పంత్ మాత్రం తీవ్ర నిరాశకు గురిచేశాడు.

Also Read: ట్రంప్‌కి మస్క్ గుడ్ బై కొట్టడానికి కారణం ఇదే… ఏంటి ఈ “బిగ్ బ్యూటిఫుల్ బిల్”?

పంత్ చేసిన పరుగుల సంఖ్యను బట్టి ఈ సీజన్‌లో అతడు చేసిన ప్రతి పరుగుకు ఎల్‌ఎస్‌జీ రూ.10 లక్షలు చెల్లించిందన్న మాట. అలాగే, ఐపీఎల్‌ 2025లో ఆడిన ప్రతి మ్యాచ్‌కు (14 మ్యాచులు ఆడాడు) పంత్ రూ.1.93 కోట్లు సంపాదించినట్లు లెక్క.

ఐపీఎల్ 2025లో భాగంగా మే27న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచులో మాత్రమే రిషబ్ పంత్ రాణించాడు. ఆ మ్యాచులో 118 (నాటౌట్) పరుగులు బాదాడు.

అయినప్పటికీ పంత్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 24.45 సగటు, 133.16 స్ట్రైక్ రేట్‌తో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్న అతడు అందుకు తగ్గట్టు ఆడలేదు. రూ.27 కోట్లకు అతడిని తీసుకుంటే కేవలం 269 పరుగులు బాదాడంటే అతడికి లక్నో ఒక్కో పరుగుకి రూ.10 లక్షలు చెల్లించినట్లు లెక్క.