Gudivada Amarnath
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంఓల మాట్లాడుతూ.. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. వైసీపీ కార్యకర్తలు నిజంగానే తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర పోలీసులు చట్టం ప్రకారం వ్యవరించాలని అన్నారు.
అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని, విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వెనక ఎవరున్నారనేది తేల్చాలని అన్నారు. ఇప్పటికీ జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని, అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడితే వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కాగా, జగన్‌కు వ్యతిరేకంగా పెడుతున్న అసభ్యకర, వ్యంగ్య పోస్టులపై డీసీపీకి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలు పెనుముప్పుగా మారాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్