Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్ లభించింది. గుంటూరు కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ఇచ్చింది గుంటూరు కోర్టు. ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించిన కేసులో సీఐడీ పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా జైల్లో పోసాని కృష్ణ మురళి ఉన్నారు.
సీఐడీ కేసులో గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో పోసాని కృష్ణమురళి త్వరలో జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 5 కేసుల్లో పోసాని అరెస్ట్ అవగా, ఈ 5 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది.
Also Read : కొడాలి నాని టార్గెట్‌గా పావులు కదులుతున్నాయా?
చంద్రబాబును దూషించారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. నాలుగు పీటీ వారెంట్లపై వేర్వేరు జిల్లా జైళ్లకు పోసానిని తరలించారు పోలీసులు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో పోసాని జైలు నుంచి విడుదల అవుతారని అనుకున్నారు. అనూహ్యంగా సీఐడీ పోసానిపై కేసు నమోదు చేసింది. కోర్టు అనుమతితో పోసానిని ఒక రోజు విచారించింది సీఐడీ. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.